ఎన్నికల శుభకార్యం .. ఓటు వెయ్యాలని ఆహ్వానపత్రిక ..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ క్రియేటివిటీ

ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూత్నప్రచారంతో ప్రజలకు చేరువయ్యారు . ఓటర్లలో చైతన్యం పెంపొందించే దిశగా ఆయన ఎన్నికల ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఇక పోలింగ్ ను ఓ శుభకార్యంగా అందులో పేర్కొన్న ఆయన పోలింగ్ శుభాకార్యంలో అందరూ పాల్గొనాలని , అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటూ ఆ ఇన్విటేషన్ కార్డులో విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే.నివాస్ ఎన్నికల శుభకార్య ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.

శుభకార్యానికి ఆహ్వానిస్తోన్న తరహాలో ఓటర్ల కోసం ఆయన ఎన్నికల ఆహ్వాన పత్రికను రూపొందించారు. మన చట్ట సభలైన పార్లమెంట్, శాసనసభలకు నూతన సభ్యుల ఎన్నిక ఉత్సవం పేరిట ఆహ్వాన పత్రికకు రూపకల్పన చేశారు. ఏప్రిల్ 11 గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శుభముహూర్తం ఉందని అందరూ తప్పక రావాలని , మీ నివాస ప్రాంతంలో ఓటు నమోదైన పోలింగ్ కేంద్రమే వేదిక, ఈ ఎన్నికల వేడుకకు ఎలాంటి కానుకలు తీసుకురావద్దు, ఇవ్వొద్దని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాకుండా, మై ఓట్ క్యూ అనే యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ సూచించారు.

Electoral ceremony .. Invitation to vote .. Sreekakulam district collector creativity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+