ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్: ఖరీదైన కార్ల చోరీ, అమ్మాయిలతో షికార్లు

హైదరాబాద్: విలాసాలకు అలవాటు పడిన ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ దొంగగా మారాడు. ఖరీదైన కార్లను చోరీ చేసి వాటిలో అమ్మాయిలతో షికార్లు చేస్తున్నాడు. అతన్ని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీనగర్ కాలనీకి చెందిన పాతికేళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆ నిర్వాకానికి పాల్పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే అమ్మాయిలతో పరిచయాల చేసుకుంటూ, విలాసాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు డబ్బు అవసరం పడడంతో కార్ల చోరీకి దిగినట్లు చెబుతున్నారు. వారం రోజుల క్రితం జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్ పార్కింగ్‌లోని వ్యాలెట్ పార్కింగ్ డ్రా నుంచి ఓ కారు తాళం చెవి తీసుకుని ఓ న్యాయవాదికి చెందిన బిఎండబ్ల్యూ కారు ఎత్తుకెళ్లాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 Engineering graduate turned into a cars theif

రంగంలోకి దిగిన పోలీసులు దసపల్లా హోటల్ సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, అతన్ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెబుతున్నారు. గతంలో కూడా బేగంపేట బాటిల్స్ అండ్ చిమ్నీ పబ్ పార్కింగ్‌లో కూడా రెండు వెర్నా కార్లను దొంగిలించినట్లు విచారణలో తేలింది.

కార్లను దొంగిలించిన తర్వాత వాటి నేమ్ ప్టేట్లను మార్చేసి అమ్మాయిలతో షికార్లకు వెళ్లడం, పబ్‌లు, క్లబ్‌ల్లో జల్సాలు చేయడం అతనికి అలవాటుగా మారిందని వార్తాకథనాలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+