క్లాస్‌లో ఇంగ్లీష్ పాఠం చదవమంటే చదవలేకపోయిన ఆంగ్ల టీచర్, సస్పెండ్

అనంతపురం/రాజమండ్రి: ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు ఓ పాఠం చదువలేని సంఘటన అనంతపురం జిల్లాలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. తాడిమర్రు మండలంలోని ఏకపాదంపల్లి పాఠశాలలో సర్దార్ బాబు అనే ఉపాధ్యాయుడు ఆంగ్లం బోధిస్తుంటాడు.

ఈ పాఠశాలను బుధవారం నాడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా సర్దార్ బాబు బోధిస్తున్నతరగతికి ఆయన వెళ్లారు.

English teacher suspend for not reading lesson from book

ఆంగ్ల పాఠాన్ని చదవాల్సిందిగా సదరు ఉపాధ్యాయుడు సర్దార్ బాబును సిసోడియా ఆదేశించారు. ఆ పాఠాన్ని సర్ధార్ బాబు చదవలేకపోయాడు. దీంతో అతని పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే ఆంగ్ల పాఠం చదవలేని పరిస్థితిలో ఉంటే ఇంకా పిల్లలకు ఏం బోధిస్తారని నిలదీశారు.

పిల్లలకు నేర్పే ఇంగ్లీష్ పాఠం చదివిస్తే చదవనందుకు, అతని పైన ప్రిన్సిపల్ సెక్రటరీ వెంటనే చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+