Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: నడకదారి మార్గంలో భక్తుల కోసం కీలక నిర్ణయాలు..!!

Tirumala: తిరుమలలో అవసరమైన మార్పుల దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈవోగా నియమితులైన శ్యామలా రావు భక్తుల సదుపాయాలు...దర్శనం..ప్రసాదం పైన ఎక్కువగా ఫోకస్ చేసారు. అదే సమయంలో సామాన్య భక్తులకు తక్కువ సమయంలో దర్శనం దిశగా తీసుకోవాల్సిన చర్యల పైన సమీక్షలు చేస్తున్నారు. తాజాగా.. తిరుమల నడక మార్గంలో వచ్చే భక్తులకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

భద్రతకు ప్రాధాన్యత
అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. నడక మార్గంలో కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితుల పైన అదికారుల నుంచి ఆరా తీసారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

EO Syamala Rao Directs key measures for the safety and security of the Pedestrian pilgrims

నివేదిక పై చర్చ
అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్నిఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులకు సూచించారు. దీంతో పాటుగా..కాలినడక మార్గంలో ఏఏ సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగా / తక్కువగా ఉన్నాయి, ఏఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి, తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు.

మార్పులు అవసరం
ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా, ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్దేశించారు.శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూలై 4వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుండి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ ఉత్స‌వానికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. జూలై 4వ తేదీన తిరుప్పావడసేవ, ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+