మా నేతల చుట్టూ తిరుగుతున్నారు: టిఆర్ఎస్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తమ పార్టీకి చెందని ఎమ్మెల్యేలు ఎవరూ వీడటం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తమ పార్టీ నేతల చుట్టూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు తిరుగుతున్నారని మండిపడ్డారు. అయినా తమ పార్టీ నేతలు ఎవరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరని అన్నారు.
ఓటమి భయంతోనే టిఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఏ సీజన్‌లో ఎంత కరెంటు ఇచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎర్రబెల్లి నివాసంలో తెలుగుదేశం నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు పర్యటనపై చర్చలు జరిపారు.
మా వృత్తి వ్యవసాయం, విమర్శలు తగదు: టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఇజ్రాయెల్ పర్యటనపై వచ్చిన ఆరోపణలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మనోహర్ రెడ్డి, విద్యాసాగర్ రావులు స్పందించారు. వారు మంగళవారం మాట్లాడుతూ..
తమ వైపు నుంచి తప్పు జరిగితే ఎత్తిచూపండని, విమర్శించడం సరికాదని అన్నారు.
వ్యవసాయం తమ వృత్తి, రాజకీయ తమ ప్రవృత్తి అని అన్నారు. రాజకీయాలకు రాకముందు నుంచే వ్యవసాయం చేస్తున్నామని ఎమ్మెల్యేలు తెలిపారు.












Click it and Unblock the Notifications