గవర్నర్ విందులో వైవీ రెడ్డితో సీఎం కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: పద్నాలుగో ఆర్థిక సంఘం బృందం గురువారంనాడు హైదరాబాద్ చేరుకుంది. ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల బృందానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర ఆహ్వానం పలికారు. ఆ తర్వాత గురువారం రాత్రి రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్ిచన విందుకు ఆర్థిక సంఘం బృందం హాజరైంది.

గవర్నర్ ఇచ్చిన విందులో ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో పాటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.

ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆర్తిక సంఘం సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వారికి ప్రతిపాదనలు అందించే విషయంపై కెసిఆర్ బుధవారంనాడు తన కార్యాలయంలో అధికారులతో కసరత్తు చేశారు.

పద్నాలుగో ఆర్థిక సంఘానికి స్వాగతం

పద్నాలుగో ఆర్థిక సంఘానికి స్వాగతం

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో వైవీ రెడ్డి నేతృత్వంలోని పద్నాలుగో ఆర్థిక సంఘం బృందానికి స్వాగతం చెప్పారు.

వైవీ రెడ్డి బృందం ఇలా...

వైవీ రెడ్డి బృందం ఇలా...

తెలంగాణకు వచ్చిన వైవీ రెడ్డి నేతృత్వంలోని పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులు శంషాబాద్ విమానాశ్రయంలో ఇలా కనిపించారు.

గవర్నర్ విందు

గవర్నర్ విందు

పద్నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమంలో కెసిఆర్ కూడా పాల్గొన్నారు.

వైబీ రెడ్డితో కెసిఆర్ ఇలా..

వైబీ రెడ్డితో కెసిఆర్ ఇలా..

రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్, పద్నాలుగో ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డిలతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలా...

రాజభవన్ విందులో ఇలా...

రాజభవన్ విందులో ఇలా...

రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, తదితరులు ఇలా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+