చంద్రబాబు మేనిఫెస్టోపై మాజీ సీఎస్ సంచలనం : జస్టిస్ ఎన్వీ రమణ వ్యాసం పైనా..!!

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలన ప్రకటించారు. వీటి ద్వారా మహిళలు..యువత..రైతులను ఆకట్టుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ హామీలపైన వైసీపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఇదే సమయంలో చంద్రబాబు హాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ క్రిష్ణారావు స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో ఎన్టీఆర్ పైన మాజీ సీజేఐ ఎన్వీ రమణ రాసిన వ్యాసం పైన చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది.

టీడీపీ మేనిఫెస్టో:
తెలుగు దేశం అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఈ మేనిఫెస్టోలోని అంశాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీంతో ఎన్నికలకు ముందుగానే ప్రజల్లోకి తాము సంక్షేమ అందిస్తామనే ప్రచారం తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా మహానాడు వేదికగా చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. మహిళకు సంబంధించి పలు హామీలు ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పనపైన మరో హామీ ప్రకటించారు. బీసీల ఓటింగ్ ను తిరిగి ఓన్ చేసుకొనే క్రమంలో కొత్త చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Ex apcs IYR Krishnarao objects Chandrababu manifesto and justice NV Ramana article, here is all

ఐవైఆర్ క్రిష్టారావు కీలక వ్యాఖ్యలు:
చంద్రబాబు మేనిఫెస్టో పై మాజీ సీఎస్ ఐవైఆర్ క్రిష్టారావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటనపైన పత్రికల్లో వచ్చిన కధనం కు తన కామెంట్స్ జత చేసారు. అందులో పోటీ ప్రజాకర్షణ పథకాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గ్రహణాలు. ఎంత త్వరగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తేల్చి మేనిఫెస్టో అమలుకు ప్రతి రాజకీయ పార్టీ ఆదాయం ఏ విధంగా చేకూర్చు కుంటుందోప్రజలకు తెలియజేయాలనే నిబంధన ఏర్పాటు చేయకపోతే అన్ని రాష్ట్రాలలో ఇది ఒక ప్రధాన సమస్య అవుతుంది...అని పేర్కొన్నారు. గతంలో అమరావతి విషయంలోనూ ఐవైఆర్ పలు సందర్భాల్లో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఐవైఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జస్టిస్ ఎన్వీ రమణ వ్యాసం పైనా:
ఇక..ఐవైఆర్ మరో ట్వీట్ చేసారు. అందులో మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గురించి రాసిన వ్యాసం పోస్టు చేసారు. ఒక ప్రముఖ పత్రికలో ఎన్వీ రమణ రాసిన వ్యాసం తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక శీర్షికన ప్రచురితం అయింది. దీని పైన ఐవైఆర్ తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఐవైఆర్ తన ట్వీట్ లో ..ఎన్టీ రామారావు గారికి తెలుగు వారి చరిత్రలో చెరిగిపోని చెరపలేని స్థానం ఉన్నది. దాని అర్థం తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక స్థాయి మాత్రం కాదు. ఒక వర్గం మీడియా మేధావులు చేస్తున్న ఈ కృత్రిమ ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది... అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+