టిడిపికి..ఎమ్మెల్యే పదవికి రావెల రాజీనామా..
ఊహించిందే జరిగింది. టిడిపి కి మాజీ మంత్రి..సిట్టింగ్ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు రాజీనామా చేసారు. ఎమ్మెల్యే పదవి తో పాటుగా టిడిపి ప్రాధమిక సభ్యత్వానికి రావెల రాజీనామా చేసారు. శనివారం నాగార్జున యూనివర్సిటీ నుండి తన అను చరులతో కలిసి ర్యాలీగా విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాన్ సమక్షంలో పార్టీలో చేరాలని రావెల డిసైడ్ అయ్యారు. రావెల పార్టీకి రాజీనామ చేయటం పై టిడిపి నేతలు పెద్దగా రియాక్ట్ కావటం లేదు. అయితే తన కు మంత్రి పదవి దూరమైనప్పటి నుండి రావెల పార్టీ లో అసంతృప్తిగానే ఉన్నారు...
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే ...మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. రైల్వే అధికారిగా వ్యవహరించిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి నుండి ప్రత్తిపాడు టిక్కెట్ ను దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన కిషోర్ బాబు ను అంతే అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. చంద్రబాబు క్యాబినెట్‌లో సాంఘిక - గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసారు.

గత ఏప్రిల్ లో జరిగిన మంత్రి వర్గ విస్తరణ లో రావెల ను మంత్రి వర్గం నుండి తప్పించారు. అప్పటి నుండి రావెల అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీలోనే ఉంటున్నప్పటికీ...ఆసక్తి చూపలేదు. పార్టీ కార్యకర్తల నుండి రావెల పై అదిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో.. ఇక పార్టీ మారాలని కొద్ది నెలల కిందటే రావెల ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే, తనకు గుంటూరు జిల్లాలో సీటు ఖరారు చేసిన పార్టీలోనే చేరాలనే ఉద్దేశంతో అటు వైసిపి తోనూ సంప్రదింపులు జరిపారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు లేదా వేమూరు స్థానాల్లో ఒక చోట నుండి అవకాశం ఇవ్వాలని కోరారు. అక్కడ హామీ దక్కకపోవటంతో జనసేను ఆశ్రయించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రెండు సార్లు సమావేశమైన రావెల తన టిక్కెట్ పై హామీ తీసుకున్నారు. దీంతో..పార్టీ లో చేరటానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దీనికి ముందుగానే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను ఏపి రాష్ట్ర టిడిపి కార్యాలయంలో అందచేసారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ లేఖను స్పీకర్ కార్యాలయానికి అంద చేసారు. శనివారం నాగార్జున యూనివర్సిటీ నుండి అనుచరులతో ర్యాలీ గా వెళ్లి..విజయవాడలో పవన్ కళ్యాన్ సమక్షం లో జనసేన లో చేరనున్నారు రావెల కిషోర్ బాబు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications