ఏపీకి అదిరిపోయే శుభవార్త
ఏపీకి, తెలంగాణకు రైల్వేశాఖ ఎంతో తీపికబురు వినిపించింది. తెలంగాణ నుంచి నడిచే మూడు ఎక్స్‌ప్రెస్‌లు, ఒక లోకల్ ప్యాసింజర్ రైలు గమ్యస్థానాల్ని అక్టోబర్9వ తేదీవరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం జైపూర్ నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న జైపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (919713/19714)ను ఏపీలోని కర్నూలు సిటీ వరకు పొడిగించారు. ఈ నిర్ణయంతో కర్నూలుతో పాటు గద్వాల, మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలు నేరుగా పింక్‌సిటీ జైపూర్‌కు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.
హడప్సర్ (పుణె)- హైదరాబాద్- హడప్సర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను (17013/17014) భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు. హెచ్‌ఎస్ నాందేడ్ - తాండూరు - పర్భణీ డైలీ ఎక్స్‌ప్రెస్ (17664/17663) రైలును సేడం, యాద్గిర్ మీదుగా రాయచూరు వరకు పొడిగించారు. కరీంనగర్ - నిజామాబాద్ - కరీంనగర్ డైలీ ప్యాసింజర్ (07894/07893)ను బోధన్ వరకు పొడిగించారు. ఆయా ప్రాంతాల ప్రజలకు ఈ రైళ్లవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ స్టేషన్‌లో సోమవారం జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ రైళ్ల పొడిగింపును ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు తదితరులను ఆహ్వానించారు. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు కలగనుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. రోజురోజుకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో సికింద్రాబాద్ నుంచి పుణెకు మరో వందే భారత్ ను కేటాయించాలనే యోచనలో రైల్వే ఉంది.












Click it and Unblock the Notifications