అత్తపై మనసు పడ్డాడు: ఇద్దర్నీ చంపేసిన అల్లుడు
లైంగిక వాంఛ తీర్చాలని అత్తపై ఓ వ్యక్తి ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అది కుదరకపోవడంతో అత్తను, మామను హత్య చేశాడు.
చిత్తూరు: గత నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగిన దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే ప్రయత్నమే హత్యకు కారణమని డీఎస్పీ నంజుండప్ప స్పష్టం చేశారు. మామ శీనయ్యను అల్లుడు వెంకటేష్ ఇనుపరాడ్‌తో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. అత్తతో సన్నిహితంగా ఉండటం చూసి మామ అల్లుడితో ఘర్షణ పడ్డాడు. విషయం బయటికి తెలుస్తుందని అత్తను కూడా అల్లుడు హతమార్చాడని పోలీసులు చెప్పారు.
నంజుండప్ప అందించిన వివరాల ప్రకారం - గుత్తివారిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కొత్తకోట శ్రీనివాసులు, అతడి భార్య ఇందిరమ్మ వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు.ఈ క్రమంలో ఆర్.మల్లవరం సమీపంలోని సదాశివరెడ్డి పంట పొలానికి కాపలా కాస్తూ బోరు పంపుషెడ్డులో నిద్రించేవారు. ఎప్పటిలాగే గత నెల 27న పొలం కాపలాకు వెళ్లారు.

అత్త ఇందిరమ్మపై మనసు పడిన అల్లుడు వెంకటేష్ తన కోరిక తీర్చాలని పలుమార్లు ఆమెను కోరాడు. అందుకు అంగీకరించలేదు. పైగా ఇందిరమ్మ ఈ విషయాన్ని భర్త శ్రీనివాసులకు చెప్పిందని వెంకటేష్ కసి పెంచుకున్నాడు దీంతో 27వ తేదీ రాత్రి మద్యం మత్తులో వెంకటేష్ పొలం వద్దకు చేరుకున్నాడు. రాత్రివేళ పంపుషెడ్డులో నిద్రిస్తున్న దంపతులపై అక్కడే ఉన్న ఇనుప గునపంతో పాటు మరో బండరాయితో తలలపై బలంగా మోది హత్యచేశాడు.
సంఘటన ప్రదేశం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో ఇంద్రమ్మ రెండు కాళ్లను పైకి తాళ్లతో కట్టి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా, ఈ ఘటనలో మామ శ్రీనివాసులు అడ్డు రావడంతో అత్యాచారం చేసిన వారే అతడిని కూడా హత్య చేసినట్లు సృష్టించాడు. ఘటన తర్వాత ఇనుప గునపం, రాయిని, రక్తపు మరకలు ఉన్న దుస్తులను పక్కపొలంలో పడేసి పారిపోయాడు.
బుధవారం సాయంత్రం కరకంబాడి-రేణిగుంట ప్రధాన రహదారిలోని కరకంబాడి ఆటోస్టాండ్ వద్ద ఉన్న వెంకటేష్‌ను పట్టుకుని విచారణ చేపట్టామన్నారు. విచారణలో తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని చెప్పారు. సమావేశంలో వలయాధికారి బాలయ్య, సిబ్బంది మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications