వివాహేతర సంబంధం: ప్రియురాలితో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భార్య
కర్నూలు: ఓ మహిళ తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే విషయాన్ని గుర్తించింది. దీంతో అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది. ఈ క్రమంలో తాను లేని సమయంలో తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండగా.. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది.
ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. శ్రీహర్ష ఆస్పత్రి యజమాని, అర్థోపెడిక్ సర్జన్ వీరరాఘవరెడ్డి గతంలో తన దగ్గరకు వచ్చిన ఓ మహిళా రోగితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు.
అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. సోమవారం ఉదయం డాక్టర్ తన ఇంట్లోనే ఆమెతో సన్నిహితంగా ఉండగా గమనించిన భార్య వినీత బయటి నుంచి తలుపుకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా, 1997లోనే వినీతకు వీర రాఘవరెడ్డికి వినీతకు వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 20లక్షలు, 20లక్షల విలువైన బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు వినీత కుటుంబసభ్యులు. కట్నం చాలలేదని వినీతకు వేధింపులకు గురిచేసేవాడు రాఘవరెడ్డి. ఓసారి తలకు గోడకు బాధడంతో వినీతకు గాయాలయ్యాయి. దీంతో వినీత తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది.
ఆ తర్వాత రాఘవ రెడ్డి పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన ఇంటికే తీసుకొచ్చి వారితో శృంగారం చేసేవాడు. ఈ నేపథ్యంలో నిఘా పెట్టిన వినీత.. మరో మహిళతో గదిలో ఉండగా గడియ పెట్టి పోలీసులకు సమాచారం అందించింది. నిందితుడిపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
కిరోసిన్ పోసుకొని వివాహిత ఆత్మహత్య
ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని ఓ తల్లి మానసిక వేదనతో ఇంట్లో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్లెం గ్రామానికి చెందిన శ్రీనుకు ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి చెందిన శ్రీదేవితో 17 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.
వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలిగారు. వీరిలో ఒక చిన్నారికి మూడేళ్లు కాగా మరో చిన్నారికి ఆరు నెలల వయస్సు ఉంది. ఆడపిల్లలు పుట్టారనే దిగులుతో మూడు నెలలుగా శ్రీదేవి ఆరోగ్యం సరిగా లేదు. వైద్యుల వద్ద చూపించుకున్న మెరుగుపడలేదు.
ఈ క్రమంలో శనివారం రాత్రి మిద్దెపై నిద్రించిన శ్రీదేవి(36) తెల్లవారుజామున ఇంట్లోకి వచ్చారు. కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. వంట చేసేందుకు వెళ్లిందని భర్త భావించారు. ఇంట్లో పొగ కమ్ముకోవడంతో కిందికి వచ్చి చూశారు. అప్పటికే ఆమె మృతిచెందింది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications