భార్య చనిపోవడంతో కోడలిపై కన్ను: ఒంటరి సమయంలో 'రేప్'.. కొడుకు సపోర్ట్!

గతేడాది నవంబర్ లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. కోడలిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం భర్త శ్రీనివాస్ కు చెప్పగా.. సహకరించమంటూ సిగ్గులేకుండా సమాధానం చెప్పాడు.

విజయవాడ: కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ.. ఆమె పట్ల కర్కషంగా వ్యవహరించాడు. బెదిరింపులతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం భర్తకు చెబితే.. సర్దుకుపోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. పుట్టింటికి వచ్చినా.. వీరి వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణలంకకు చెందిన మహిళ(32)కు 12ఏళ్ల క్రితం సూర్యారావుపేట బోయపాటి వారి వీధికి చెందిన లక్ష్మీ శ్రీనివాస్(40)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న శ్రీనివాస్.. చీటికీమాటికీ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

father-in-law rapes daughter-in-law with the support of son

ఇదే క్రమంలో గత మూడేళ్ల క్రితం శ్రీనివాస్ తల్లి మరణించింది. అప్పటినుంచి శ్రీనివాస్ తండ్రి కోడలిపై కన్నేశాడు. గతేడాది నవంబర్ లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. కోడలిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం భర్త శ్రీనివాస్ కు చెప్పగా.. సహకరించమంటూ సిగ్గులేకుండా సమాధానం చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు పుట్టింటికి వెళ్లిన శ్రీనివాస్.. అక్కడ కూడా అసభ్యకర రీతిలో ఆమెను వేధించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితురాలు వేడుకుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+