కూతురిపై తండ్రి అత్యాచారం: రెండు గ్రామాల మధ్య రగడ
హైదరాబాద్: గిరిజన బాలిక పైన జరిగిన సామూహిక అథ్యాచారం, హత్య కేసు సంఘటన ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. అత్యాచారం కేసులో తండ్రి దోషి అయితే తమ గ్రామస్థులను ఎందుకు ఇరికించే ప్రయత్నం చేశారని మండిపడుతూ మరో గ్రామస్థులు వచ్చారు.
రంగారెడ్డి జిల్లాలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య మిష్టరీని పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. తండ్రే ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అయితే, ఆ తండ్రి మాత్రం.. ఆటో డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులు తన కుమార్తెను ఎత్తుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కట్టు కథ అల్లాడు.
ఈ ఘటన పైన పోలీసులు 30 మంది వరకు విచారించారు. తండ్రి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో తండ్రి మెగావత్ కమల్ అలియాస్ శ్రవణే కూతురు పైన ఆ దారుణానికి పాల్పడినట్లుగా భావించారు.

అయితే, అనవసరంగా తమ గ్రామస్థుల పైన నిందలు మోపారని మండిపడుతూ బారువా గ్రామస్థులు సదరు తండ్రి గ్రామానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కూతురిపై ఘటన విషయంలో తండ్రి విచారణలో భిన్న కథనాలు వినిపించాడు. మేఘావత్ కమల్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుత బాధితురాలు పెద్ద కూతురు.
చందానగర్‌లో బంధువుల ఇంట్లో ఉన్న కూతురిని కమల్ తీసుకుని వస్తూ దారుణానికి ఒడిగట్టాడు. చీకట్లో వద్దని బంధువులు చెప్పినా వినకుండా అతను కూతురిని తీసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో ఘటన జరిగింది. కమల్ తనకు తానే గాయపర్చుకున్నాడు. తనకు తాను గాయపర్చుకొని, తన పైన ఇతరులు దాడి చేశాడని చెప్పాడు.












Click it and Unblock the Notifications