• search

మామే మృగాడు:కోడలిపై కన్నేసి...లొంగలేదని...కాళ్లుచేతులు నరికేశాడు

By Suvarnaraju
Subscribe to Oneindia Telugu
For kadapa Updates
Allow Notification
For Daily Alerts
Keep youself updated with latest
kadapa News

  కడప:మనుషుల్లో మానవత్వం మృగ్యమైపోతుందనడానికి...మానవులే మృగాల కంటే కిరాతకంగా ప్రవర్తిస్తున్నారనడానికి నిదర్శనమీ ఘటన. కామాంధుడిగా మారి కోడలిపై కన్నేసిన ఒక మామ ఆమె తన కోరిక తీర్చడం లేదని మృగాడిగా మారిపోయాడు.

  ఏ రకంగా ప్రయత్నించినా ఆమె తన దారికి రాకపోతుండటంతో...మనవడు,మనవరాలిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. వారిని వెతుక్కొంటూ వచ్చిన కోడలిని కోరిక తీర్చమని బ్లాక్ మెయిల్ చేశాడు. అయినా లొంగక పోవడంతో...ఆ కసితో పిల్లల ముందే ముచ్చుకత్తి తీసుకొని ఆమె కాళ్లు చేతులు నరికాడు. ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా చావుబతుకులతో కొట్టుమిట్టాడుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...

  Father in law arrested in murder attempt of daughter in law backdrop of sexual abuse

  కడప జిల్లా సిద్దవటం ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి కథనం ప్రకారం...భాకరాపేటకు చెందిన కాడె వెంకటసుబ్బయ్య కుమారుడు రామ్మోహన్‌కు కదిరికి చెందిన సుగుణతో 14 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. అయితే ఇంటీవలి కొంతకాలంగా వెంకటసుబ్బయ్య తన కోడలు సుజాతను లొంగపరుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మామ లైంగిక వేధింపులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో 20 రోజుల క్రితం సుజాత మామ వ్యవహారాన్ని గ్రామ పెద్దలకు తెలిపి పంచాయితీ పెట్టింది.

  అయినా మామలో మార్పు రాకపోవడంతో ఇక అక్కడుంటే ప్రమాదమని భావించి పిల్లలతో సహా సుజాత తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే మామ వెంకటసుబ్బయ్య సుజాత స్వగ్రామానికి వెళ్లి తన మనవడు, మనవరాలిని తన వద్దే ఉంచుకుంటానంటూ భాకరాపేటకు తీసుకొచ్చేశాడు. దీంతో తన కొడుకూ, కూతురును మామ సుబ్బయ్య ఏం చేస్తాడోనని భయపడిన సుజాత భాకరాపేటకు తిరిగివచ్చింది. తన పిల్లలను తనకు ఇచ్చేయమని అడిగింది.

  దీంతో మామ వెంకట సుబ్బయ్య ఈమె ఇక తన దారికి రాదని...అప్పటికే ఒకసారి తనపై పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టించిందన్న కక్షతో ఇక ఆమెని బతకనీయకూడదని ఇంట్లో ఉన్న మచ్చు కత్తితో కాళ్లు, చేతులు తెగ నరికాడు. ఆమె అరుపులు విని అక్కడకు వచ్చిన స్థానికులు వెంటనే 108 వాహనం సహాయంతో చావు బతుకుల మధ్య ఉన్న ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మామ వెంకటసుబ్బయ్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.

  మరిన్ని కడప వార్తలుView All

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Father in law arrested in murder attempt of daughter in law backdrop of sexual abuse

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more