నిద్రమాత్రలు: కన్న తండ్రే కాలయముండై కాటేశాడు

 Fathers kills daughters in Prakasam district
హైదరాబాద్: కన్న తండ్రే వారి పాలిట కాలయముడై కాటేశాడు. తన కన్నబిడ్డలను చేజేతులా చంపేశాడు. పండ్ల రసంలో నిద్రమాత్రలు కలిపి పిల్లలను హతమార్చాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీనగర్‌లో చోటు చేసుకుంది.

చిన్నారికట్ట వెంకటేష్ నగరంలోని ఓ టీ దుకాణంలో పనిచేస్తూ గాంధీనగర్ నాలుగో వీధీలో తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. తాను పనిచేస్తున్న దుకాణం నుంచి వస్తూ నూడిల్స్, పండ్ల రసం తీసుకొచ్చాడు. భార్యకు తెలియకుండా పండ్ల రసంలో నిద్రమాత్రలు కలిపాడు.

ఆ పండ్ల రసాన్ని కుమారుడు ధర్మాసాయి (4), శ్రీనివాసు (11 నెలలు)లకు తాగించాడు. పండ్ల రసం తాగిన చిన్నారులిద్దరూ మరణించారు. ఈ ఘటనతో తల్లి హృదయవిదారకంగా రోదించింది.

ఇదిలావుంటే తూర్పు గోదావరి జిల్లా గోపవరం మండలం గుమ్మలదొడ్డిలో కట్టుకున్న భార్యపైనే ఓ భర్త యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

భర్త తనను మద్యం సేవించి వచ్చి వేధిస్తుండడంతో భార్య ఆరు నెలలుగా విడిగా ఉంటోంది. ఈ స్థితిలో ఆమెపై అతనికి అనుమానం కలిగిందని, దాంతో దాడికి పూనుకున్నాడని చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లె మండలం కొండసానిపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, మరిది పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+