ఏపీలో అలాంటి కాలేజీలకు ఇక తాళమే.. నో ట్యూషన్ ఫీజ్‌కు జగన్ సర్కార్ సిఫారసు
ఏపీలో ఇంజనీరింగ్ కాలేజీల పైన కఠిన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి. కనీస ప్రమాణాలు..ఫీజుల విషయంలో కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని కాలేజీలకు చెక్ పెట్టాలని, అవసరమైతే ఫీజును తగ్గించడం లేదా అసలు ఫీజు లేకుండా సిఫారసు చేయాలన్న యోచనలో ఉన్నత విద్య నియం త్రణ కమిషన్ కూడా ఉన్నట్లు తెలు స్తోంది.
రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలను పాటించని కాలేజీలను ఏ మాత్రం ఉపేక్షించరాదని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశాలపైన ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత సిఫార్సులు...నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

నో ఫీ జాబితాలో 50 కాలేజీలు..
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనలు పాటించకుండా, కనీస ప్రమాణాలు లేకుండా నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకునేలా ఉన్నత విద్య నియంత్రణ.. పర్యవేక్షణ కమిషన్ సిఫారసులు చేయనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. వీటిలో దాదాపు 50 కళాశాలలకు 2019-20 నుంచి 2021-22 విద్యా సంవత్సరాలకు ట్యూషన్ ఫీజును సిఫారసు చేయకుండా నో ఫీ జాబితాలో పెట్టే విధంగా సిఫార్సులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆ 50 ఇంజనీరింగ్ కళాశాలల అఫిలియేషన్ రద్దుచేసేలా విశ్వవిద్యాలయాలకు సిఫారసు చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లుతా తెలుస్తోంది.

కనీస ఫీజు రూ 35 వేలు తగ్గించే ఛాన్స్..
ఏపీలో ఉన్న కాలేజీల్లో.. వాస్తవిక ఆదాయ-వ్యయాలు, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త ట్యూషన్ ఫీజులను సిఫారసు చేయాలని కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న కనీస ఫీజు రూ.35 వేలు తగ్గించే అవకాశం కనిపిస్తోంది. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని కాలేజీలను అదుపు చేసే విధంగా.. అవసరమైతే ఫీజును తగ్గించడం లేదా అసలు ఫీజు లేకుండా సిఫారసు చేయాలన్న యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలను పాటించని కాలేజీలను ఏ మాత్రం ఉపేక్షించరాదని కమిషన్ భావిస్తోంది.

ఆ కాలేజీలకు తాళం తప్పదా..
కనీసం పాటించాల్సిన ప్రమాణాలను పాటించని కళాశాలల జాబితాను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి.. ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే నిర్వహిస్తున్న కాలేజీలపై ఉన్నత విద్య నియంత్రణ.. పర్యవేక్షణ కమిషన్ నిశిత దృష్టి సారించింది. ఇప్పటివరకు 3 దశల్లో 120 ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక బృందాల ద్వారా కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
కొన్ని కాలేజీల పనితీరు అధ్వాన్నంగా ఉన్నట్లు కమిషన్ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయంలో దారుణమైన పరిస్థితి ఉన్నట్లు తేల్చింది. దీంతో..నాలుగో విడత ఈ నెల 28-29 తేదీల్లో మరో 50 కాలేజీల్లో తనిఖీలు చేపట్టనుంది. వాస్తవ ప్రణాళికలో భాగంగా.. 2019-20-22 వరకు అంటే మూడు సంవత్సరాల సగటు కాలానికి ట్యూషన్ ఫీజులపై ఈ నెలాఖరులోనే హైకోర్టుకు, ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు సమాచారం.
-
కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!! -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
రైతుబజార్ కూరలు ఇక ఇంటికే, ఇలా చేస్తే చాలు- అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!! -
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications