తండ్రి: 1956ముందు వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్స్!
హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి 1956 సంవత్సరమే ప్రామాణికం కానుంది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన కుటుంబాల పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అర్హులు కానున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు లేదా మూడు రోజుల్లో విడుదల కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం సంక్షేమ, విద్యా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా విద్యార్థుల స్థానికతపై సుదీర్ఘంగా చర్చించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హతగా నిర్ణయించే విద్యార్థుల స్థానికతకు 1956వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికతను నిర్థారించడానికి మండల స్థాయిలో ఎక్కడికక్కడ కమిటీలను ఏర్పాటు చేయాలని, లోకల్ సర్టిఫికెట్లను మీ సేవా కేంద్రాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం పేరిట ఫీజు పథకాన్ని ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications