కర్నూల్‌లో తమ్ముళ్ల బాహాబాహి : భూమా వర్సెస్ శిల్పా వర్గీయుల రచ్చ

కర్నూలు : కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లకు.. అదివరకే పార్టీలో కొనసాగుతున్న నేతలకు టీడీపీలో అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. సందర్బం వచ్చినప్పుడు.. అడపాదడపా ఈ కుమ్ములాటలు బయటపడుతున్నాయి. తాజాగా కర్నూల్ పాలిటిక్స్ లో భూమా నాగిరెడ్డికి, శిల్పా చక్రపాణిరెడ్డికి మధ్యనున్న వైరం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Fight between Bhooma Nagireddy supporters and Shilpa chakrapani

భూమా వర్గం టీడీపీలోకి రావడం ఏమాత్రం ఇష్టంలేని శిల్పా వర్గం.. భూమా వర్గీయులతో పేచీలు పెట్టుకుంటూనే ఉంది. ఇక తాజా విషయానికొస్తే.. మునిసిపల్ కౌన్సిల్ సమావేశం సందర్బంగా ఇరు వర్గాల అనుచరులు బాహాబాహికి దిగారు. దీంతో సమావేశం మధ్యలో ఉండగానే ముగించేయాల్సి వచ్చింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించేశారు.

ఆక్రమణలు, రోడ్ల విస్తరణపై చర్చలో భాగంగా.. నందికొట్కూరులో కేజీ రోడ్డును 120 అడుగుల మేరకు విస్తరించాలని తీర్మానించడంతో వివాదం తలెత్తింది. మునిసిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని హైవే అథారిటీకి అధికారులు పంపడంతో.. భూమా వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీయడంతో.. మునిసిపల్ కౌన్సిల్ హాల్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. చివరికి పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+