వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డి వర్సెస్ దామోదర: పోరు ప్రత్యక్షమే, రచ్చే

By Pratap
|
Google Oneindia TeluguNews

Fight between Damodara vs Kiran reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ మధ్య మళ్లీ ప్రత్యక్ష యుద్ధం ప్రారంబమైంది. మెదక్‌ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టడంతో ఇరువురి మధ్య పోరు ప్రారంభమైంది. రచ్చబండకు స్థానిక నేతల సహాయం దక్కకుండా దామోదర రాజనర్సింహ ఇప్పటికే మెదక్‌జిల్లా కాంగ్రెస్‌ నేతలకు ఆదేశాలు జారీచేసినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ రచ్చబండను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సభ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం అయ్యేలా చూడాలని తన అనుయాయులను ఆదేశించి నట్లు తెలుస్తోంది. మెదక్‌ జిల్లా రచ్చబండ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సిఎం వర్గీయుడిగా పేరొందిన ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కరుడుగట్టిన సమైక్యవాది కిరణ్‌ రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కోరుతూ మంగళవారం మెదక్‌ జిల్లా బంద్‌కు టిఆర్‌ఎస్‌, టి జాక్‌ పిలుపునిచ్చాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభ విజయవంతం కానివ్వకుండా చూసి కిరణ్‌ను ఇరకాటంలోకి నెట్టాలని దామోదర వర్గం భావిస్తోంది. అయితే ఆ జిల్లాలో రచ్చబండను విజయవంతంగా నిర్వహించి తన సత్తా ఏమిటో చాటాలని కిరణ్‌ శిబిరం సిద్దమవుతోంది. రచ్చబండ సిఎం, డిప్యూటీ సిఎంల బలబలాలకు పరీక్షగా మారిందని ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకొని తమ నిరసనను వ్యక్తంచేయాలని టిఆర్‌ఎస్‌, టి జాక్‌ గట్టిగా నిర్ణయం తీసుకొన్నాయి. ఇందుకోసం మెదక్‌జిల్లాబంద్‌కు అవి పిలుపునిచ్చాయి. ఈ ప్రతిఘటనల నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుందా ప్రతిష్టకోసం నామమాత్రంగా సాగుతుందా అన్నది కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో చర్చాంశనీయమైంది.

English summary
Fight between CM Kiran kumar reddy and Deputy CM Damodara Rajnarsimha has begun with Racchabanda programme in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X