చంద్రబాబు రాకకు ముందు... తిరుమలలో పోలీసుల కొట్లాట, గాయాలు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకకు కొద్దిసేపటి ముందు తిరుమలలో స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్‌కు, ఓ ప్రయివేటు సెక్యూరిటీ గార్డుకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
ఆలయ మహాద్వారం వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, ప్రయివేటు సెక్యూరిటీకి మధ్య ఘర్షణ జరిగింది. భక్తులకు భద్రతగా ఉండాల్సిన పోలీసులు ఇలా కొట్టుకోవడాన్ని ఎస్పీఎఫ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆలయ మహాద్వారం దగ్గర జరిగిన ఈ ఘటనలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శివానంద తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన ఇతర పోలీసులు అతనిని అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం మోహినీ రూపంలో స్వామివారి ఊరేగింపు ముగిసిన అనంతరం ఈ గొడవ చోటు చేసుకుంది. బాలాజీ అనే సెక్యూరిటీ గార్డు గొడవకు కారణమని, అతనే దాడి చేశాడని శివానంద ఆరోపించాడు. వాకీటాకీతో కొట్టినట్లుగా తెలుస్తోంది.

తన విధుల్లో భాగంగా ఆయుధంతో ఆలయం లోపలికి వెళ్తున్న శివానందను సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడమే గొడవకు మూల కారణమని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
తిరుమలలో దేవాన్ష్ అన్న ప్రాసన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనువడు దేవాన్ష్ అన్న ప్రాసన కార్యక్రమం తిరుమలలో ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు దంపతులు, బాలకృష్ణ దంపతులు, లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు, చంద్రబాబు తన మనవడు దేవాన్ష్ పేరిట అన్నదాన కార్యక్రమం కోసం రూ.20 విరాళాన్ని టిటిడికి అందించారు.












Click it and Unblock the Notifications