వర్మపై జనసైనికులకు సరికొత్త అనుమానం...?
ఎన్నికల ఫలితాలు రాకముందే టీడీపీ, జనసేన నేతల మధ్య అధిపత్యపోరు సాగుతోంది. పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి కూడా టీడీపీ, జనసేన నేతల మధ్య నువ్వా నేనా అనే అధిపత్య ధోరణే కొనసాగింది. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన నేతలకు జనసేన టికెట్లు దక్కలేదు. టీడీపీ నుంచి వచ్చిన నేతలకే జనసేన టికెట్లు ఇవ్వడంతో చాలామంది నేతలు పార్టీని వీడారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో అప్పుడే జనసేన , టీడీపీ నేతల మధ్య అధిపత్య పోరు సాగుతోందని తెలుస్తోంది.
పిఠాపురం టీడీపీ నేత వర్మ ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయడంతో ..పవన్‌కు టికెట్ దక్కింది. పవన్ కల్యాణ్ గెలుపు టీడీపీ నేత వర్మ మీద ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని పవన్ సైతం ఒప్పుకోవడం ఆయన వ్యక్తిగత చరిష్మాకు మైనస్‌గా మారింది. మరోవైపు వర్మ బరిలో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు, క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. పవన్ గెలుపు ఖాయమైందని కలలు కంటోన్న నేతల మధ్య అధిపత్య పోరు మొదలైందని తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..అక్కడ నెంబర్ 2 స్థానం కోసం ఇరువురు నేతల మధ్య పోరు సాగుతున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం టికెట్‌ను త్యాగం చేశారు వర్మ. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే..స్థానిక నేత కాబట్టి ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు నాగబాబుకు సైతం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ఇస్తారని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ గెలుపు నా వల్లే అని వర్మ టీవీ డిబేట్లలో చెబుతున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
ఇకవేళ అందరు అనుకున్నట్టు పవన్ కల్యాణ్ గెలిచినా ఆ క్రెడిట్ వర్మ కొట్టేస్తారని జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి నాయకుల్లా వర్మ కూడా రిలాక్స్డ్ గా ఉండకుండా ఎందుకు ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు లేకపోతే వర్మ దగ్గరుండి దెబ్బ కొట్టి దానికి కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మీడియా డిబేట్లతో కవర్ చేస్తున్నారా అంటూ జనసేన పార్టీ కార్యకర్తల నుంచి సందేహాలు వ్యక్తం అవటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వర్మ పవన్ కళ్యాణ్‌ను నిజంగాన్నే బుజాన మోసారా లేక పుట్టి ముంచారా అన్నది రేపటి ఫలితాల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications