ప్యారడైజ్ హోటల్లో అగ్నిప్రమాదం, ఆందోళన (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రసిద్ధమైన సికింద్రాబాదులోని ప్యారడైజ్ హోటల్లో ఆదివారంనాడు అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో హోటల్‌కు వచ్చినవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. హోటల్ భవనం కింది అంతస్థులోని వంటగది పార్సల్ సెక్షన్ చిమ్నీ నుంచి మంటలు ప్రారంభమయ్యాయియ
హోటల్‌ను యాజమాన్యం ఖాళీ చేయించింది. ఆ ప్రాంతమంతా ఆదివారం ఉదయం దట్టమైన పొగలతో నిండిపోయింది. ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందించారు. అర గంటపాటు ఫైర్ టెండర్స్ పనిచేశాయి. దాంతో మంటలు చల్లారాయి.
నష్టం చాలా తక్కువగా జరిగిందని, విస్తరించక ముందే మంటలను ఆర్పగలిగారని అధికార వర్గాలు చెప్పాయి. రామగోపాల్‌పేట పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అయితే, కేసు నమోదు చేయలేదు.

ప్యారడైజ్‌లో అగ్నిప్రమాదం
సికింద్రాబాదులో ప్రసిద్ధమైన ప్యారడైజ్ హోటల్లో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్సిల్ సర్వీస్ వంటగదిలోని చిమ్నీ నుంచి ఈ మంటలు ప్రారంభమయ్యాయి.

దత్తాత్రేయ సందర్శన
సంఘటనా స్థలాన్ని సికింద్రాబాద్ బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ సందర్శించారు.

దట్టమైన పొగలు
ప్యారడైజ్ హోటల్లో మంటలు లేవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

శుభ్రం చేయకపోవడం వల్లనే...
ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శుభ్రం చేయకపోవడం వల్లనే ప్యారడైజ్ హోటల్ చిమ్నీ నుంచి మంటలు లేచినట్లు భావిస్తున్నారు.

ఆందోళనలో ప్రజలు..
మంటలు తలెత్తగానే యాజమాన్యం ప్యారడైజ్ హోటల్‌ను ఖాళీ చేయించింది. ఫైర్ టెండర్స్ వచ్చి మంటలను ఆర్పాయి.

పోలీసుల తనిఖీ..
ప్యారడైజ్ హోటల్ పార్సల్ సర్వీస్ వంటగది చిమ్నీ నుంచి మంటలు ప్రారంభమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మేయర్ సందర్శన
మంటలు లేచిన సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌ను హైదరాబాదు నగర మేయర్ సందర్శించారు.

హోటల్‌ను మూసేశారు
మంటలు లేవడంతో ప్యారడైజ్ హోటల్‌ను ఆదివారంనాడు పూర్తిగా మూసేశారు. ఫైర్ టెండర్లతో మంటలను ఆర్పివేశారు.












Click it and Unblock the Notifications