షేర్ మార్కెట్ లో ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ 5 షేర్లు..
షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. నిపుణుల సలహాతోపాటు మనకు అనుభవం ఉంటే ఒక రూపాయి సంపాదించడానికి ఉపయోగపడుతుంది. తొలిసారి మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికోసం ఈ సూచనలు సలహాలు ఉపయోగపడతాయి. ఒడిదుడుకులతో, రిస్క్ తో కూడుకున్న రంగం ఇది. సరైన స్టాక్ ను గుర్తించి పెట్టుబడి పెట్టినప్పుడే లాభాలు అందుతాయి.
ఏదో ఒక కంపెనీలో పెట్టుబడి పెడితే సరిపోతుంది కదా అని అనుకుంటుంటారు. కానీ అది చాలా తప్పు. ఒక స్టాక్ ను ఎంచుకునేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ లో 5 రకాల స్టాక్స్ ఉంటాయి వాటిగురించి తెలుసుకోండి.
గ్రోత్ స్టాక్స్
బహిరంగ మార్కెట్ తో పోలిస్తే ఇవి చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. తక్కువ వడ్డీలు ఉన్న సమయంతోపాటు ఎకనామిక్ సైకిల్ విస్తరణ దశలో ఈ తరహా షేర్లు రాణిస్తుంటాయి. అలాంటి సమయాల్లో కొనుగోలు చేస్తే మంచి లాభాలు అందుకోగలరు.

వాల్యూ స్టాక్స్
విస్తృత మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే ఇవి లభిస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ పిరియడ్ సమయంలో ఈ స్టాక్స్ బ్రహ్మాండంగా రాణిస్తుంటాయి.
డివిడెండ్ యీల్డింగ్ స్టాక్స్
డివిడెండ్ రూపంలో లాభాలను రెగ్యులర్ గా అందిస్తుంటాయి. అలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. రెగ్యులర్ స్ట్రీమింగ్ ద్వారా లాభాలు వస్తాయి.
సైక్లికల్ స్టాక్స్
ఇవి ఎకనామిక్ సైకిల్స్‌పై ఆధారపడి ఉంటాయి. వీటిపై అవి ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఆర్థిక వ్యవస్థ హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ స్టాక్స్ రాణింపు ఆధారపడివుంటుంది.
డిఫెన్సివ్ స్టాక్స్
ఎకనామిక్ సైకిల్స్‌లో స్థిరమైన పని తీరును కనపరుస్తాయి. ప్రజల నిత్యావసరాలు, వినియోగదారుల వస్తువులను ఉత్పత్తి చేసే రంగాలకు చెందుతాయి.
ఇటీవలి కాలంలో బొంబాయి స్టాక్స్ ఎక్స్చేంజ్ సూచీలు, నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అయినప్పటికీ నిఫ్టీ తొలి సారి 19 వేల మార్కును తాకింది. సెన్సెక్స్ సైతం కొత్త రికార్డులను సృష్టించేందుకు దూసుకువెళుతోంది. ఈ గణాంకాలు చూసే చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే సరైన అవగాహన లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.












Click it and Unblock the Notifications