కురిసిన చేపల వర్షం: ఎగబడిన జనం
గుంటూరు: జిల్లాలోని నగరం మండలం ఉయ్యూరిపాలెంలో శనివారం రాత్రి చేపల వర్షం కురిసింది. నారుమళ్లలో చేపలను పట్టుకునేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో పొలాల్లో చేపలు పడ్డాయని గ్రామస్తులు తెలిపారు.
ఒక్కో చేప సుమారు 2కేజీల బరువు ఉందని చెప్పారు. ఆదివారం ఉదయాన్నే నారుమళ్ల వద్దకు వెళ్లిన రైతులు పొలాల్లో ఉన్న చేపలు చూసి ఆశ్చర్యపోయారు. ఉయ్యూరివారిపాలెం సమీపంలో సమీపంలో సముద్రం ఉంది.
కాగా, భారీ సుడిగాలులకు నీటితోపాటు చేపలు కూడా ఆకాశంలోకి వెళ్లి.. వర్షంతోపాటు పడి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలోని గోళ్లమూడిలో కూడా చేపల వర్షం కురిసిన విషయం తెలిసిందే.
రాజమండ్రిలో భారీ వర్షం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్, రైల్వేస్టేషన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
కొండవాగులో నలుగురు గల్లంతు: ఇద్దరు మృతి
పశ్చిమగోదావరి జిల్లాలోని గుబ్బలమంగమ్మ గుడి దగ్గరగల కొండవాగులో ఓ కుటుంబం గల్లతైంది. కృష్టా జిల్లా గుడివాడ మండలం అన్నవరప్పాడుకు చెందిన ఓ కుటుంబం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల సరిహద్దుగలోగల గుబ్బలమంగమ్మ గుడికి బయలుదేరారు.
శనివారం నుంచి భారీగా వర్షం కురుస్తుండడంతో కొండవాగు పొంగింది. దీంతో ఆ వాగును దాటుతూ కళ్యాణి(35), సరస్వతి(60) అనే ఇద్దరు మహిళలు కొట్టుకుపోయి మృతిచెందారు. మరో ఇద్దరిని స్థానిక గిరిజనులు రక్షించారు.












Click it and Unblock the Notifications