మహిళపై రేప్ చేసి వీడియో తీశారు: ఐదుగురి అరెస్ట్

గుంటూరు: మహిళ పైన అత్యాచారానికి పాల్పడడంతోపాటు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బెదిరించిన కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ నెల 19న యడ్లపాడుకు చెందిన ఓ మహిళ తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు.

అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారని రూరల్‌ సీఐ దిలీప్ కుమార్‌ విలేకరులతో అన్నారు. ఈ కేసులో భాగంగా యడ్లపాడుకు చెందిన కారుచోల అంకమ్మరావు, కారుచోల మహీంద్రబాబు, బందెల రవీంద్ర, ఎడ్లూరి నాగరాజు, కె చినకోటేశ్వరరావులను అరెస్టు చేసినట్టు తెలిపారు. కాగా, ఆ వీడియోను బ్లూటూత్ ద్వారా పలువురికి పంపించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సముద్రస్నానానికి వెళ్లి ముగ్గురు మృతి, ఒకరి గల్లంతు

Five arrest in rape case

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరంలో ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు మిత్రుల్లో ముగ్గురు మృతి చెందగా మరోకరు గల్లంతు కాగా మరొకరు ప్రాణాలతో ఒడ్డుకు చేరారని పోలీసులు తెలిపారు. నాగూర్‌బాబు, బాజీబాబు, మాబూసుభాని, యూసుబ్‌, జిలానీ సముద్రస్నానానికి వెళ్లారు. వీరిలో షేక్‌ జిలానీ మాత్రమే ఒడ్డుకు చేరాడు.

ఎమ్మెల్సీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ఆదివారం ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య వాహనం ఢీకొని తోడెండ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. ఎమ్మెల్సీ వాహనం ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తుండగా మెట్ట వద్ద అతను రహదారిని దాటుతుండగా ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+