విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాణసంచా పేలి ఐదుగురు కూలీలు మృతి(పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు గ్రామం వద్దనున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. దుర్ఘటనలో నలుగురు కూలీలు ఘటనా స్థలంలోనే మరణించారు. ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. మరో వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని విశాఖలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఘటనలో నూతి సత్యవతి (35, గోకులపాడు), భూపతి సత్తిబాబు (45, పాయకరావుపేట), లింగంపల్లి శేషమ్మ (43, గోకులపాడు), భూపతి లోవరాజు (50) ఘటనా స్థలంలోనే మరణించారు. ఇక గాయపడిన కశిరెడ్డి కృష్ణ (22, గోకులపాడు), కడారి దుర్గ (13, గోకులపాడు), కశిరెడ్డి విశ్వనాథం (40, సోమిదేవపల్లి), బంగారు అప్పారావు (36, పాయకరావుపేట), ఎన్ దుర్గ (14, గోకులపాడు), చలంశెట్టి లక్ష్మి (34, గోకులపాడు)ను విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కడారి దుర్గ అనే బాలుడు మరణించాడు. విస్ఫోటనం ధాటికి రమణ అనే వ్యక్తి ఎగరి పక్కనే ఉన్న బావిలోపడ్డాడు. ఇతని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రాత్రి 10 గంటల వరకూ అగ్నిమాపక సిబ్బంది బావినుంచి నీటిని తోడారు. రమణ మృతదేహం సోమవారం బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెపుతున్నారు.

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు గ్రామం వద్దనున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఐదుగురు మరణించారు.

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

బాణసంచా విస్ఫోటనం ధాటికి రమణ అనే వ్యక్తి ఎగరి పక్కనే ఉన్న బావిలోపడ్డాడు. ఇతని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రాత్రి 10 గంటల వరకూ అగ్నిమాపక సిబ్బంది బావినుంచి నీటిని తోడారు.

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద సుమారు 20ఏళ్లనుంచీ బాణసంచా తయారీ కేంద్రాన్ని మడగల నానాజీ నడుపుడుతున్నాడు. నిత్యం 15మంది కూలీలు బాణసంచా తయారు చేస్తుంటారు.

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

పేలుడుతో బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కూలీల శరీరాలు వందమీటర్ల దూరానికి ఎగిరిపడ్డాయి. ఘటనలో బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. విస్ఫోటనం శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల వరకూ వినిపించిందని అంటున్నారు

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు తరువాత మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుకు నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడు

బాణసంచా పేలుడుతో రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో తీవ్ర కలకలం చెలరేగింది. బాణసంచా తయారీ కేంద్రం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద సుమారు 20ఏళ్లనుంచీ బాణసంచా తయారీ కేంద్రాన్ని మడగల నానాజీ నడుపుడుతున్నాడు. నిత్యం 15మంది కూలీలు బాణసంచా తయారు చేస్తుంటారు. అయితే ఆదివారం 12మంది తయారీ కేంద్రానికి వచ్చారు. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో బాణసంచా కేంద్రంలో భారీ విస్పోటనం సంభవించింది. దీంతో కేంద్రంలో పనిచేస్తున్న కూలీల శరీరాలు వందమీటర్ల దూరానికి ఎగిరిపడ్డాయి. ఘటనలో బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. విస్ఫోటనం శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల వరకూ వినిపించిందని అంటున్నారు

విస్ఫోటనం తరువాత మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని ఎంపీ అవంతి శ్రీనివాసరావు, డిఐజి రవిచంద్ర, ఎస్పీ కోన ప్రవీణ్, జెసి నివాస్ సందర్శించారు. ఘటన తరువాత ఆచూకీ తెలియకుండా పోయిన వారికోసం గాలిస్తున్నట్టు ఎస్పీ ప్రవీణ్ తెలిపారు. కాగా, బాణసంచా తయారీ కేంద్ర యజమాని నానాజీని అదుపులో తీసుకున్నట్టు ఎస్పీ వివరించారు.

సిఎం దిగ్భ్రాంతి

గోకులపాడు ఘటన సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్ యువరాజ్, సిపి అమిత్ గార్గ్, ఎస్పీ కోన ప్రవీణ్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఘటనపై మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతులకు సిఎం రిలీఫ్ ఫండ్

బాణసంచా కేంద్రాలపై తనిఖీలు

బాణసంచా ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. బాణసంచా కేంద్రాలలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది. ఉప ముఖ్యమంత్రి కాసేపట్లో ఈ ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు.

English summary
Five people have died in a blast at a fire cracker manufacturing unit near Visakhapatnam in Andhra Pradesh this afternoon, according to reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X