వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడాలి నానికి అలా కలిసొస్తోంది - గుడివాడ టీడీపీలో కొత్త లొల్లి : బందరులో పంచాయితీ..!!

|
Google Oneindia TeluguNews

గుడివాడ. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని కొద్ది రోజుల క్రితం వరకు మంత్రిగా ఉండి సంచలనంగా మారారు. టీడీపీకి టార్గెట్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కొడాలి నాని పైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కొడాలి నాని సైతం సై అంటున్నారు.

గుడివాడ కేంద్రంగా చంద్రబాబు

గుడివాడ కేంద్రంగా చంద్రబాబు


జిల్లాల పర్యటనలు ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 28న గుడివాడ కేంద్రంగా జిల్లా మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. దీనిని జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కొడాలి నాని నియోజకవర్గం కావటంతో సహజంగానే దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి సంబంధించి గుడివాడలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, సడన్ గా స్థానిక టీడీపీ నేతల మధ్య కొత్త వివాదం ఒకటి మొదలైంది. నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో యాక్టివ్ అయిన శిష్ట్లా లోహిత్ పార్టీ అధినేత కు స్వాగతం పలుకుతూ గుడివాడ ప్రధాన సెంటర్లలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసారు.

టీడీపీ నేతల ఫ్లెక్సీల గొడవ

టీడీపీ నేతల ఫ్లెక్సీల గొడవ


అయితే, లోహిత్ బ్యానర్లపై రాత్రికి రాత్రి , కొత్త ఫ్లెక్సీలు రావి వర్గీలయులు ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది. చాలా కాలంగా రావి వర్గం టీడీపీలోనే ఉంది. నియోజకవర్గంలో లోహిత్ యాక్టివ్ ఇప్పుడు ఈ వర్గానికి ఇబ్బందిగా మారింది. దీంతో..రెండు వర్గాలు పోటా పోటీగా టీడీపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసాయి. దీంతో..రెండు వర్గాల నేతలను బందరు రావాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించింది. అక్కడ జిల్లా పార్టీ నేతల సమక్షంలో పంచాయితీ చేసేందుకు సిద్దమయ్యారు. కొద్ది రోజుల క్రితం గుడివాడ లో నిర్వహించే మహానాడు పైన స్వయంగా పార్టీ అధినేత ఆరా తీసారు.

మహానాడు వర్సెస్ ప్లీనరీ

మహానాడు వర్సెస్ ప్లీనరీ

పార్టీ నేతలకు సూచనలు చేసారు. దీంతో..టీడీపీ స్థానిక నాయకత్వం ఇక్కడ నిర్వహించే మహానాడును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొడాలి నాని లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అదే రోజున వైసీపీ ప్లీనరీ సైతం నిర్వహించేందుకు ముమూర్తం నిర్ణయించారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల స్థానంలో వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో..ఇప్పుడు గుడివాడ కేంద్రంగా ఫ్లెక్సీల రగడ..రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
Disputes araised between TDP leaders in Gudivada on arranging flexies for district mahanadu, Hi command arranged meeting in Bandar,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X