ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2025: భారీ డిస్కౌంట్ల పండుగ.. తగ్గేదేలే!
రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఆఫర్లతో ఫ్లిప్ కార్డ్ ప్రతి సంవత్సరంలో మాదిరిగానే ఈ సంవత్సరం భారీ డిస్కౌంట్ సేల్ తీసుకువచ్చింది. ఫ్లిప్కార్ట్ అప్ కమింగ్ సేల్ మాన్యుమెంటల్ సేల్ జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఇక ఈ సేల్ లో అనేక ప్రొడక్ట్స్ పైన భారీ ఆఫర్లు, డీల్స్ అందుకోవచ్చని ఇప్పటికే ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్
జనవరి 14వ తేదీన ఫ్లిప్కార్ట్ సభ్యుల కోసం ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఇక దానికి ఒక రోజు ముందు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఈ సేల్ ప్రారంభమవుతుంది. వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫారం ఈ సేల్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆశించడానికి ప్లాన్ చేస్తుంది.

బ్యాంక్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, డిస్కౌంట్లు
కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంకు ఆఫర్లను, తగ్గింపులను, క్యాష్ బ్యాక్ లను కూడా అందిస్తూ ఈ సేల్ ను బాగా ప్లాన్ చేసింది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే స్పెషల్ సేల్ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు మరియు గృహపుకరణాలకు వివిధ కేటగిరీలపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్ జనవరి 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
యాపిల్ ఐఫోన్ 16 తక్కువ ధరలకు
విక్రయ సమయంలో కొనుగోలుదారులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ ద్వారా లావాదేవీలను చెల్లించడం ద్వారా 10% తక్షణ తగ్గింపును పొందుతారు.
ఫ్లిప్కార్ట్ సేల్ ద్వారా యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ జనవరి 13న తగ్గింపు ధరలతో విక్రయించబడుతుందని తెలిపారు. ప్రస్తుత ఆఫర్ ఐఫోన్ 16 ఆఫర్ ధర 63,399 రూపాయలుగా ఉంటే, అసలు ధర 79,900 రూపాయలుగా ఉంది.
స్మార్ట్ టీవీలు, హోం అప్లయన్సెస్ పై డిస్కౌంట్స్
ఐఫోన్ 16 ప్లస్ 73, 999 రూపాయలుగా ఉంది. దీని అసలు ధర 89, 900 రూపాయలు. ఇక google పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ప్లస్ వంటి మొబైల్ ఫోన్ల పైన కూడా భారీ డిస్కౌంట్ లను ఇస్తోంది. ఇక స్మార్ట్ టీవీ ల పైన భారీ డిస్కౌంట్ ను హోం మరియు కిచెన్ ప్రొడక్ట్స్ పైన అద్భుతమైన ఆఫర్లను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. మరెందుకు ఆలస్యం. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే మాన్యుమెంటల్ సేల్ కు సిద్ధం కండి.












Click it and Unblock the Notifications