జగన్‌పై కాదు జనసేన గెలుపుపై దృష్టి పెట్టు.. పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం కొనసాగుతుంది. మరో పదిరోజుల్లో ఏపీలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న రాజకీయ పార్టీల నాయకులు ప్రజల మనసులో స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రత్యర్ధి పార్టీలపైన విరుచుకుపడుతూ ఎన్నికల రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు
ఇక ఈసారి ఎన్నికలు అందరికంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఈ ఎన్నికల్లో జనసేన గెలవకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. ఇక కూటమిలో భాగంగా ఎన్నికలకు వెళుతున్న జనసేన కోసం పవన్ కళ్యాణ్ ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న పోసాని కృష్ణ మురళి తనదైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ నువ్వు గెలవాలంటే ఈ పని చెయ్
తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడిన పోసాని కృష్ణ మురళి గతంలో టీడీపీ, బీజేపీ పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీలతోనే పొత్తులు పెట్టుకున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు గెలవాలంటే జగన్ ను ఓడించాలని కాదు.. నువ్వు గెలవాలి అన్నదే లక్ష్యంగా పెట్టుకో అన్నారు. అసలు నేను ఎలా గెలవాలి? నేను గెలవాలంటే ఏం చెయ్యాలి? అనేది ఆలోచించాలి అన్నారు.
పవన్ కళ్యాణ్ కు జగన్ తో ఎలాంటి పోలిక లేదు
సింహం లా సింగిల్ గా జగన్ వెళ్తున్నారని, అసలు పవన్ కళ్యాణ్ కు జగన్ తో ఎలాంటి పోలిక లేదన్నారు. జగన్ చాలా మంచి నాయకుడని పేర్కొన్న పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ రాంగ్ టైం లో రాజకీయాల్లోకి వచ్చారన్నారు, జనం నిరుత్సాహంలో ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఉంటేమంచి నాయకుడివి అయ్యేవాడివని అన్నారు.
పవన్ కళ్యాణ్ చెప్పుకునేవి అన్నీ గొప్పలే
పవన్ కళ్యాణ్ మాట్లాడితే జనం కోసం అది చేశాం .. ఇది చేశాం అని చెప్తున్నారని, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయని , అందుకే ఆయన సహాయం చేశారని పోసాని కృష్ణ మురళి అన్నారు. తాను కూడా 15 మందికి గుండె ఆపరేషన్లు చేయించానని చెప్పారు. లక్షల్లో పెళ్లి చేయించానని, ఎంతో మంది విద్యార్థులను చదివించానని చెప్పారు. అంతమాత్రాన తాను గొప్పవాడిని అవుతానా అని ప్రశ్నించారు. కానీ పవన్ కళ్యాణ్ గొప్పలు చెప్పుకుంటున్నారు అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications