చంద్రబాబు కోసం: నల్ల షర్టులతో నిరసన; "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్!!
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనపై అనేక తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆయన అరెస్టును నిరసిస్తూ ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్లో వరుసగా నిరసనలు తెలియజేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్‌లతో ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" కార్యక్రమం నిర్వహించాలని భావించిన వారంతా చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం చేపట్టారు.

నల్ల టీ షర్ట్ లు ధరించి ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం చేయాలని, తద్వారా తమ నిరసనను తెలియజేయాలని భావించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేశారు చంద్రబాబు అభిమానులు. అయితే చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ లోప్రజలు చేపట్టిన 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గారికి మద్దతుగా "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" కార్యక్రమం. చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‍లో వినూత్న కార్యక్రమం. #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu… pic.twitter.com/Donu938gEA
— Telugu Desam Party (@JaiTDP) October 14, 2023
చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, మియాపూర్ మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నల్ల టీ షర్టులు ధరించి వచ్చిన వారు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావటం లేదని వారు అంటున్నారు.
చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ లో చేపట్టిన 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో ప్రజలు శాంతియుతంగానే పాల్గొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు వారిని అడ్డుకుంటున్నారని, నల్ల దుస్తులు ధరించి మెట్రో ఎక్కడం కూడా నేరమై పోయిందా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్లో నల్ల టీ షర్టులు ధరించి చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు ఐటీ ఉద్యోగులు.












Click it and Unblock the Notifications