Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారి కోసం .. నిన్న అసోం సీఎంతో .. ఇప్పుడు గుజరాత్ సీఎంతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మత్స్యకారుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌‌కు ఫోన్ చేసిన సీఎం జగన్ తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఫోన్ చేశారు . గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకారుల లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్ తాజాగా చేపల ఎగుమతికి అనుమతిని ఇవ్వాలని , అడ్డంకులను తొలగించటానికి దృష్టి పెట్టాలని అసోం సీఎంతో మాట్లాడారు .

ఇక ఇదే క్రమంలో గుజరాత్ సీఎంతో కూడా జగన్ మత్స్యకారుల గురించి మాట్లాడారు . పొట్టకూటి కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్ డౌన్ కారణంగా అక్కడ ఏపీ మత్స్యకారులు చిక్కుకున్నారని, ఆహారం , నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఫోన్ చేసిన జగన్ ఆయనతో కరోనా పరిస్థితుల గురించి మాట్లాడారు . అక్కడి తెలుగు మత్స్యకారుల అంశం కూడా మాట్లాడిన ఆయన వారికి అండగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు .

For the fishermen, AP CM Jagan spoke with Gujarat CM

ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇక సీఎం జగన్ గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారని , వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని చేసిన విన్నపం మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్ రూపానీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని ట్వీట్ చేశారు .మొత్తానికి సీఎం జగన్ మత్స్య కారుల కోసం తీసుకుంటున్న చొరవతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+