• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు .. ఏ విషయంలో అంటే

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజా కరోనా లాక్ డౌన్ పరిస్థితులపై, అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఐదు పేజీలున్న లేఖలో చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అన్నీ కూలంకషంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఊహించలేదని ఆయన బాధపడ్డారు. కరోనా లాక్ డౌన్ వల్ల వలస, చేనేత కార్మికుల, చర్మ కారుల, స్వర్ణ కారుల, భావన నిర్మాణ కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కరోన వ్యాప్తికి కారణం అన్నారు .

రైతుల పరిస్థితి, వివిధ రంగాల కార్మికుల కష్టాలపై స్పందించిన చంద్రబాబు

రైతుల పరిస్థితి, వివిధ రంగాల కార్మికుల కష్టాలపై స్పందించిన చంద్రబాబు

రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు లేఖలు రాసినా, ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోని సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విపత్తులలోనే నాయకత్వ సామర్థ్యం బయటపడేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అసమర్ధత , వైసీపీ నాయకుల అత్యుత్సాహం వెరసి కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పార్టీగా టీడీపీ ప్రజలకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు చెప్పారు.

 వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధతారాహిత్యం వల్లే కరోనా వ్యాప్తి

వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధతారాహిత్యం వల్లే కరోనా వ్యాప్తి

వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధతారాహిత్యం వల్లే కరోనా వ్యాప్తి అధికమైందని ఆయన ఆరోపించారు. వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా టెస్ట్ లపై లేదని ఆరోపించారు. కరోనా కిట్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు. పీపీఈలు ఇవ్వకపోవడం వల్లే డాక్టర్ల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. హెల్త్ బులిటెన్లను ఫార్స్ గా మార్చారని అన్నారు. ఒక ఎంపీ కుటుంబానికి, రాజ్‌భవన్‌లో ఉద్యోగులకు కరోనా సోకడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని చంద్రబాబు వ్యాఖ్యానించారు .కేవలం పబ్లిసిటీ రాజకీయాలు తప్ప వైసీపీ నాయకులు చేసిందేమీ లేదని చెప్పారు.

 ప్రజలు కరోనా కట్టడికి బాధ్యతాయుతంగా ఉండాలని చంద్రబాబు పిలుపు

ప్రజలు కరోనా కట్టడికి బాధ్యతాయుతంగా ఉండాలని చంద్రబాబు పిలుపు

ఇక ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు పౌరులుగా బాధ్యత నిర్వర్తించాలని పిలుపు నిచ్చారు. మన ఊరు , మన వార్డు , మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని కోరారు. ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులే బాధ్యత విస్మరించిన వేళ ప్రజలే కార్యోన్ముఖులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటించటం , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అలాగే శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం , మానసికంగా ధృడంగా ఉండటం చెయ్యాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక బంధాలను, కుటుంబ అనుబంధాలను పరిరక్షించుకుంటూ సమాజాన్ని సురక్షితంగా ఉంచుదామని పేర్కొన్నారు .

  Coronavirus Will Continue As A Part Of Human Life : AP CM Jagan

  English summary
  AP former CM Chandrababu Naidu has written an open letter to the public on the latest corona lockdown situation, as well as the steps that should be taken in light of the growing corona cases. In a five-page letter, Chandrababu summarized the current situation and government policies. TDP chief and former chief minister Chandrababu Naidu expressed concern over corona situation in the state. He was sad that such a situation could never have been imagined.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X