• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ నెక్స్ట్ సీఎం కాపు నేతే-అధికారం వారిద్దరికే సొంతం కాదు-చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

నిత్యం తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే నేతల్లో ఒకరైన కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ ఇవాళ మరో సంచలనం రేపారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా బందరు పర్యటనకు వచ్చిన ఆయన.. ఏపీలో కుల రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు, తదుపరి సీఎం ఎవరో చెప్పిన జోస్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

ఏపీలో 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాపు సామాజిక వర్గ నేతే అయి ఉంటాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం ఆ రెండు సామాజిక వర్గాల సొంతం కాదని కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. అయితే సీఎం అయ్యే వ్యక్తి ఎవరో మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో పవన్ కళ్యాణ్, లేదా చిరంజీవిని ఉద్దేశించే చింతా మోహన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

former congress mp chinta mohan predict next ap chief minister from kapu community

మరోవైపు చింతామోహన్ బీజేపీ నేతలపై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సాధించిన అభివృద్ధిని లెక్కలేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారని చింతా మోహన్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బెజవాడ రైల్వే స్టేషన్, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. హరిత విప్లవంలో భాగంగానే ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆనాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పునాదిరాయి వేశారని, కృష్ణా, గుంటూరు,ప్రకాశం, పచ్చిమ గోదావరి జిల్లాలోని 40లక్షల ఎకరాలకు సాగు నీరు ఒక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తో వస్తుంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పాలని గుర్తు చేశారు.

ప్రపంచ స్థాయికి ఆంధ్రరాష్ట్రాన్ని తీసుకెళ్ళిన శ్రీహరికోట లోని అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చింతా మోహన్ తెలిపారు. 7 సంవత్సరాలుగా పాలనలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కి ఏమిచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఒక పక్క 100 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉంటే ప్రధాన మంత్రికి చాలా దగ్గరగా ఉండే మరో పారిశ్రామిక వేత్త మరోపక్క రోజుకు 1000 కోట్లు సంపాదిస్తున్నాడని అదానీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో భారత దేశంలో ఆకలి కనిపిస్తుందని, అభివృధి కుంటుపడిందని, ఆస్తులు అమ్ముకుంటున్నారని చింతా మోహన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 80 లక్షల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఫీజుల రియాంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు సంక్రాంతిలోపు చెల్లించాలని వైసీపీ ప్రభుత్వాన్ని చింతా మోహన్ డిమాండ్ చేశారు...

English summary
former congress mp chinta mohan on today predicts next chief minister of ap and says that the cm will come from kapu community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X