IYR Krishna Rao : రాజధానుల సమస్యకు పరిష్కారమిదే- చంద్రబాబు, జగన్ దీ తప్పే..
ఏపీలో రాజధానుల సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని విపక్షాలు, మూడు రాజధానులు ఉండాలని అధికార వైసీపీ పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ విద్వేషాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఇవాళ రాజధానుల వ్యవహారంలో తప్పెవరిదన్న దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపారు. ఆయనేమన్నారంటే...

1953 నుంచే రాజధాని సమస్య
ఏపీలో 1953 నుంచే రాజధాని అంశం వివాదంగానే ఉందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. రాజాజీ, ప్రకాశం పంతులు వంటి నేతలు నాడు నిర్ణయించలేక పోయారని, ఆనాడు గౌతు లచ్చన్న వంటి పెద్దలు గుంటూరు లో రాజధాని పెట్టాలని చెప్పారని, హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఐవైఆర్ చెప్పారు.
ఆ తరువాత అనుకోని పరిణామాల తో పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. దీంతో ఇప్పటికీ రాజధాని వివాదం సమస్యగానే ఉందన్నారు.

చంద్రబాబు, జగనే కారణమయ్యారిలా..
2014లో రాష్ట్ర విభజనలో చంద్రబాబు రాజధానిని పూర్తి స్థాయిలో అమలుచేయలేదని ఐవైఆర్ తెలిపారు. నేటి రాజధాని వివాదాలకు ఆది పురుషుడు చంద్రబాబు అయితే, మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఎంతో చారిత్రక నేపధ్యం ఉన్న నాలుగు ప్రాంతాలను కలుపుకుని వెళ్లడంలో చంద్రబాబు విఫలమయ్యారని,
రాజధాని పేరుతో రైతుల భవిష్యత్తు ను పణంగా పెట్టారని ఐవైఆర్ విమర్శించారు. ఒకేసారి పెద్ద రాజధాని నిర్మాణం సాధ్యం కాదని తెలిసినా పనులు చేపట్టారని, 1953లో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ లేదని,కానీ 2014లో రియల్ ఎస్టేట్ ఎంటర్ అయ్యిందన్నారు. రాజధాని అభివృద్ధి చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి ని చంపేశారని, మధ్యలో ఉన్న పనులను కూడా పూర్తిగా ఆపేసి రాజధానిని నాశనం చేసారన్నారు. అమరావతి ని పరిపాలనా రాజధానిగా ఉంచి, మహానగరంగా విశాఖను అభివృద్ధి చేస్తే వివాదం ఉండేది కాదన్నారు.

రాజధానులకు పరిష్కారం ఇదే !
హైకోర్టు ను కర్నూలుకు తరలించాలన్నిది బీజేపీ విధానమని, ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయవచ్చని ఐవైఆర్ తెలిపారు. దానికి రాజధానే చేయనక్కర్లేదన్నారు. పచ్చటి కొండలను తవ్వేసి ప్లాట్లు వేసి దోచుకోవడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. పరిపాలనా రాజధాని ఉన్న ప్రాంతమే ఏపీ రాజధాని అని, అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ పెద్ద తప్పని ఐవైఆర్ తెలిపారు. ఏపీకి రాజధాని అమరావతి, మహా నగరం విశాఖపట్నమని ఐవైఆర్ పేర్కొన్నారు. అభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విశాఖలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆయనసూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు బిజెపి ప్రభుత్వం సిద్దమన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు అపడం కష్టం
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టడం సులువని, వాటిని నియంత్రణ చేయడం కష్టమని మాజీ సీఎస్ ఐవైఆర్ తెలిపారు. రాష్ట్ర పాలకులు ఈ అంశాలను పరిశీలించి ఇటువంటి చర్యలు ఆపాలన్నారు. ఏపీ రాజధాని విషయం లో ఇదే బిజెపి విధానమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి లేకుండా పోయిందని, అమరావతి ప్రాంతంలో పనులు పూర్తిగా నిలిపి వేశారని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం లో కనిపిస్తున్న పనులు కేంద్రం చేసే అభివృద్ధేనన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడమే తప్ప పనులు చేయడం లేదన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి ఉంటే అది ప్రతిబింబించేలా కనిపించాలి కదా అన్నారు. దీపావళి వస్తుంటే సీఎంను కలిసి ఉద్యోగులు అదనపు సౌకర్యాలు అడిగే వారని, ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి అర్ధంచేసుకోవచ్చన్నారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్










Click it and Unblock the Notifications