జగన్ అభివృద్ధి చేసిన స్కూల్స్ లో చంద్రబాబు ఉపన్యాసాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. విద్యారంగాన్ని బ్రష్టు పట్టించేలాగా చంద్రబాబు విధానాలు ఉన్నాయని, గవర్నమెంట్ స్కూల్స్ ను నిర్వీర్యం చేసేలాగా కూటమి ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మెగా మీట్ కాదు దగా మీట్
సీఎం చంద్రబాబు పేద విద్యార్థుల భవిష్యత్తు పైన విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు జీవితంతో చెలగాటమాడుతూ ఇప్పుడు మరో డ్రామాకు తెరతీసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పేరెంట్స్ తో మెగా మీట్ అంటూ దగా మీట్ నిర్వహించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరకుండా చంద్రబాబు దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు.

జగన్ అభివృద్ధి చేసిన స్కూల్స్ లో చంద్రబాబు ఉపన్యాసాలు
కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా తిరోగమన దిశగా ప్రయాణం చేస్తుందని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు వేలకోట్ల ఫీజు బకాయి పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఫీజు చెల్లింపుల పైన దృష్టి సారించలేదన్నారు. మాజీ సీఎం జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లల్లో కూర్చొని సిఎం చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తుపై ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ఏనాడైనా అనుకున్నారా?
మూడుసార్లు సీఎంగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఏనాడైనా విద్యారంగాన్ని ఆధునీ కరించాలని అనుకున్నారా? చెప్పాలన్నారు. కనీస వసతులకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాలని భావించారా? అంటూ ప్రశ్నించారు పిల్లలకు స్కూళ్లలో రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించిన ఘనత జగన్ గారికే దక్కుతుందన్నారు.
ఇంగ్లీష్ మీడియం నిలిపివేశామని చెప్పకపోయారా?
జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించారని, సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టారని, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ ను పరిచయం చేశారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఏ రోజైనా విద్యార్థుల భవిష్యత్తును గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. ఇక నేడు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టిన చంద్రబాబు మెగా పేరెంట్స్ మీట్లో జగన్ హయాంలో మీ పిల్లలకు ఇచ్చిన ఇంగ్లీష్ మీడియం నిలిపివేశానని చెప్పకపోయారా అంటూ ప్రశ్నించారు.
మెగా పేరెంట్స్ మీట్ పెట్టే అర్హత ఉందా?
సిబిఎస్ఈ విధానానికి మంగళం పాడానని, గోరుముద్దను పక్కనపెట్టి నాశరకం భోజనం పెడుతున్నామని పేరెంట్స్ కు వివరిస్తారా అంటూ ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న చంద్రబాబుకు అసలు మెగా పేరెంట్స్ మీట్ పెట్టే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. విద్యారంగంలో కీలకమైన విశ్వవిద్యాలయాలను సైతం రాజకీయం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో విద్యావ్యవస్థను నాశనం చేశారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications