పవన్ కల్యాణ్ గారూ..పంచే ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు..!
ఏపీలో కూటమి పాలనపై వైసీపీ కీలక నాయకురాలు, మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో కరువొచ్చినా పండుగొచ్చినట్టుగానే పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు. మీరు పంచే ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదని విజయవాడ వరద బాధితుల కోసమని పవన్ కల్యాణ్‌కు రోజా కౌంటరిచ్చారు. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడి రోడ్డుపై కాదని, ఎన్నికల సమయంలో మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసిన వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం ధర్నాలు చేయాలని పవన్‌కు రోజా సూచించారు.
మీరు గొడవపడాల్సింది మతాల కోసం కాదని ,నీట మునిగి సాయమందని పేదల కోసం మీ పార్టనర్‌తో గొడవపడాలని తెలిపారు. మీరు కడిగాల్సింది గుడి మెట్లను కాదని, ఇసుక లేకుండా చేస్తోన్న మీ నాయకుల అవినీతిని కడగాలని పవన్‌కు మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.ఇక ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యలపై రోజా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని రోజా అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని, ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రాతినిధ్యం వహిస్తోన్న చోటే మహిళలకు రక్షణ లేదని ఆమె దుయ్యపట్టారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, జగన్ వస్తున్నారని తెలియగానే హోం మంత్రి బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని రోజా తెలిపారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడాడు. ఈ ఘటనపై రోజా స్పందించారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడింది టీడీపీ నేత అని తెలియగానే ఆయన్ను కాపాడాలని చూడటం నిజంగా సిగ్గుచేటని రోజా తెలిపారు.బాధిత కుటుంబం ధర్నాకు దిగిన తర్వాతే నిందితుడిపై కేసు నమోదు చేశారని రోజా తెలిపారు. దీక్షలు చేయాల్సింది ప్రసాదాల కోసం కాదని రాష్ట్రంలో రాలిపోతున్న ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాలను కాపాడటం కోసం దీక్షలు చేయడంటూ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు.ఇప్పటికైనా పక్క రాష్ట్రాల నాయకుల జోలికి వెళ్లకుండా మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు ముగింపు పలకాలని రోజా పవన్‌పై సైటెర్లు వేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పొలిటిక్స్‌కు తెర లేపిందని, నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రోజా చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications