కేంద్రానికి సాయిరెడ్డి కీలక విజ్ఞప్తి..! జాతీయ స్ధాయిలో..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలో వారికి సైతం కంటగింపుగా మారిన ఎంపీ విజయసాయిరెడ్డి.. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు, ఎంపీ పదవికీ రాజీనామా చేసి సన్యాసం ప్రకటించారు. ఆ తర్వాత కూడా పలు విషయాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పలు అంశాలపై కేంద్రానికి సూచనలు చేస్తూ విజయసాయిరెడ్డి పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా గుండె జబ్బులపై సాయిరెడ్డి ఓ పోస్టు పెట్టారు. దేశంలో గుండె జబ్బుల తీవ్రత ఏ స్ధాయిలో ఉంది, దీన్ని అరికట్టడానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ మాజీ ఎంపీ ఓ పోస్టు పెట్టారు. ఇందులో సమస్య తీవ్రతను వివరించడంతో పాటు కేంద్రానికి ఓ కీలక సూచన కూడా చేశారు.

భారతదేశంలో, ప్రతి మూడు మరణాలలో ఒకటి గుండె జబ్బుల వల్ల సంభవిస్తుందని సాయిరెడ్డి తెలిపారు. రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదిక ప్రకారం, మొత్తం మరణాలలో 56.7% నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితి దేశ ఆరోగ్య వ్యవస్థకు తీవ్రమైన హెచ్చరికగా పనిచేస్తుందన్నారు. మనం సమిష్టిగా ఈ సవాలును ఎదుర్కోవాలని కోరారు.
भारत में हर तीन मौतों में से एक दिल की बीमारी से होती है। महापंजीयक की नवीनतम रिपोर्ट बताती है कि गैर-संक्रामक रोग कुल 56.7% मौतों का कारण हैं। यह स्थिति देश के स्वास्थ्य तंत्र के लिए गंभीर चेतावनी है और हमें मिलकर इस चुनौती से निपटना होगा। मैं केंद्र सरकार से आग्रह करता हूँ कि…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 6, 2025
దేశవ్యాప్తంగా గుండె జబ్బుల నివారణకు సమగ్ర అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాలని మరియు దానిని జాతీయ ప్రాధాన్యతగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి కోరారు.అయితే సాయిరెడ్డి వినతిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి పలు పోస్టులు పెడుతున్నా దానికి కేంద్రం వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. అయినా సాయిరెడ్డి పోస్టుల వార్ మాత్రం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications