పార్టీపై చెప్పండి: పవన్‌కు మాజీ పిఆర్పీ నేతల సూచన!

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలపై ప్రకటన చేస్తారని ప్రకటన వెలువడినప్పటి నుండి వివిధ రకాల ప్రచారం జరుగుతోంది. పవన్ రాజకీయాల్లోకి వస్తారా? పార్టీ పెడతారా? అనే అంశాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. స్వయంగా ఆయనే ఓ ప్రకటన చేసి ఉత్కంఠకు తెర దించుతారట.

బుధవారం పవన్ మాజీ ప్రజారాజ్యం పార్టీ, యువరాజ్యం నేతలు పలువురితో భేటీ అయ్యారు. తాను రాజకీయాలలోకి రానున్నట్లు కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు, తదనంతర పరిణామాలపై వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై ఓ స్పష్టతనిస్తే బాగుంటుందని వారు పవన్ కల్యాణ్‌కు సూచించారట.

Former PRP leaders suggests Pawan Kalyan

పవన్ కళ్యాణ్ రాజకీయ తెరంగ్రేటం గురించి మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజా నిర్మాత నీలిమ తిరుమల శెట్టి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.‘ఎవరూ అయోమయానికి గురి కావద్దు. అంతా ప్రశాంతంగా ఉండండి. త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారు' అని ట్వీట్ చేసారు.

కాగా.. మార్చి రెండో వారంలో రాజకీయాలపై తన అభిప్రాయాన్నీ, పార్టీ స్థాపించే విషయం గురించి, ఎన్నికలలో పోటీ చేసే విషయం గురించి స్వయంగా వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారా? అని మీడియాతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+