Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్..! 14 రోజుల రిమాండ్..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసులో దాదాపు రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ను తాజాగా అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో కాకాణిని పోలీసులు జైలుకు తరలిస్తున్నారు.
చెన్నైలో నివసించే విద్యాకిరణ్ అనే వ్యక్తికి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల్లో రుస్తుం మైన్స్ ఉన్నాయి. దాని లీజు గడువు ముగియడంతో రెన్యువల్‌కు దరఖాస్తు చేశారు. దీన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో రెన్యువల్ చేయకుండా అక్రమంగా ఆక్రమించుకుని క్వార్ట్‌జ్ తవ్వుకుని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు కాకాణిపై ఉన్నాయి. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన ఈ దందాపై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం కాకాణి కోసం గాలిస్తోంది.

ఈ నేపథ్యంలో బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్ లో కాకాణి ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా కాకాణి పట్టించుకోలేదు. అంతే కాదు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో అరెస్టు తప్పదని నిర్ధారణకు వచ్చాక అజ్ఢాతంలోకి వెళ్లిపోయారు. ఇలా 55 రోజులు అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications