బాలకృష్ణపై ఇవేం ట్రోల్స్ రా అయ్యా..!
నేటి రాజకీయాలు కేవలం సభలకే పరిమితం కావడం లేదు. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, వివాదాలు వెంటనే సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ తీవ్రమైన రాజకీయ పరిణామం ఇప్పుడు నెట్టింట నవ్వులు పుట్టిస్తున్న వీడియోకు ఆధారమైంది.
ఈ వివాదానికి మూలం ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సినీ నటులు కలిసిన సమయంలో వారిని అవమానించారని హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ రోజు జగన్‌ను కలిసిన సినీ నటుల జాబితాలో తన పేరును 9వ నంబర్‌లో చేర్చడంపై బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కామినేని శ్రీనివాస్ పైనా ఆయన చేసిన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

అసెంబ్లీలో ఈ వివాదం ముగిసినా, సోషల్ మీడియాలో మాత్రం '9వ నంబర్' అంశం వైరల్ ట్రెండింగ్‌గా మారింది. బాలకృష్ణ పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఈ నంబర్‌ను పదేపదే ఉటంకిస్తూ ఫన్నీ వీడియోలను రూపొందిస్తున్నారు.
తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో... కొంతమంది స్నేహితులు కలిసి ఒక పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే, వారిలో ఒక వ్యక్తి తాను రానని మొండికేస్తాడు. ఎందుకని అడిగితే, "నా పేరు లిస్ట్‌లో 9వ స్థానంలో నమోదు చేశారు, అందుకే నేను హర్ట్ అయ్యాను" అని తీవ్ర భావోద్వేగంతో పేర్కొనడం నవ్వులు పూయించింది.
Booking no 9 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/plLwb951Ba
— Harsha💥 (@2Ysjagan) September 29, 2025
అసెంబ్లీలో బాలకృష్ణ ప్రస్తావించిన 9వ నంబర్‌నే ఈ వీడియోలో ఉటంకించడంతో, ఇది ఏపీ రాజకీయ పరిణామాలకు హాస్యాన్ని జోడించింది. అయితే, ఈ ఫన్నీ వీడియో రూపొందించిన వ్యక్తులు వైసీపీ అనుకూలురని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి, ఏపీ రాజకీయాల్లో జరిగిన తీవ్ర చర్చను ఈ చిన్న వీడియో... ప్రజలకు సరదాగా గుర్తుచేస్తూ, సోషల్ మీడియా రాజకీయ ప్రభావానికి అద్దం పడుతోంది.












Click it and Unblock the Notifications