ఏం పాపం చేశారని?: కరణం వర్గీయుల అంత్యక్రియల్లో మిన్నంటిన రోదనలు..

మృతదేహాలను తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కొంత సేపు ఉంచి, తరువాత వారి వారి గృహాలకు చేర్చారు. ఆపై అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రకాశం: ఏపీలో వరుస ఫ్యాక్షన్ కక్షలు అక్కడి జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రకాశం జిల్లా వేమవరంలో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులపై ప్రత్యర్థుల దాడిని మరిచిపోకముందే.. కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ భూతం పడగవిప్పింది. అద్దంకి ఘటనలో మృతి చెందిన బలరాం అనుచరులకు ఆదివారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన పెద్ద అంజయ్య, ఎ.కోటేశ్వరరావుల మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం సంతరించుకుంది. మృతుల బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు. "ఏ పాపం చేశారని.. ఇలా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

fuenral held for who died in addanki faction attack

మృతదేహాలను తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కొంత సేపు ఉంచి, తరువాత వారి వారి గృహాలకు చేర్చారు. ఆపై అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా.. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి టీడీపీ నేతలంతా తరలివచ్చారు.

మృతదేహాలకు ఎమ్మెల్సీ కరణం బలరాం, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ వెంకటేశ్ నివాళులు అర్పించారు.
తమ తండ్రులు మరణించారన్న విషయం తెలుసుకుని, మృతుల కుమారులు.. అమెరికా నుంచి వేమవరం చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+