బాలకృష్ణ మంచోడు: జగన్, చంద్రబాబుపై ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్షనాయకుడు, వైసిపి అధినేత జగన్ కు, టిడిపి ఎమ్మెల్యే కదిరి బాబురావుకు మద్య సరదా సంబాషణ చోటుచేసుకొంది. బుదవారం నాడు అసెంబ్లీలో లాబీల్లో ఈ విషయమై ఇద్దరి మద్య జరిగిన ఆసక్తికర సంబాషణపై టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆరా తీశారు.

వైసిపి అధినేత జగన్ కు, టిడిపి ఎమ్మెల్యే కదిరిబాబురావుకు మద్య సరదా సంభాషణ బుదవారం నాడు అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకొంది. టిడిపి ఎమ్మెల్యేలలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చాలా మంచోడని జగన్ ఆయనను ప్రశంసలతో మెంచెత్తారు. ఎటువంటి విమర్శలు చేయరని ఆయన చెప్పారు.జగన్ బాలకృష్ణపై చేసిన కితాబు సరైనదేనా కాదా అంటూ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కదిరి ఎమ్మెల్యే బాబురావును అడిగి తెలుసుకొన్నారు. గతంలో వైసిపి అధినేత జగన్ బాలకృష్ణ అభిమానం సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని కదిరి బాబురావు సరదాగా సంభాషించారు.

funny conversation between ys jagan, kadiri babu rao

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పే మాటలన్నీ అబద్దాలేనని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సభలో తాను మాట్లాడకుండా అడ్డుకొనేందుకే అసెంబ్లీని గురువారం రోజుకు వాయిదా వేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ మీడియాతో చిట్ చాట్ చేశారు. 80 శాతం ప్రాజెక్టు పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయన్నారు. మిగతా 20 శాతం పనులను కూడ చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు.గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడు సహ ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. మూడేళ్ళైనా చంద్రబాబుకు ధ్యాసే లేదన్నారు.

శ్రీశైలంలో నీళ్ళున్నా రాయలసీమకు నీళ్ళివ్వలేదని అలాంటి మనిషి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి పూర్తైందని, ఇప్పటివరకు నిర్వాసితులకు పరిహరం చెల్లించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మాట్లాడేందుకుగాను అవకాశం లేదన్నారు. పాత అంశాలను ప్రస్తావనకు తెచ్చారన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు అవకాశం లేదని సభను తప్పుదోవ పట్టిసున్నారని మండిపడ్డారు.ప్రతిపక్షనేత అడిగితే సమయం ఇవ్వరా మరి చంద్రబాబు చేసింది సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాకే సభలోకి వెళ్ళామని, అప్పుడు కూడ తమకు మాట్లాడే అవకాశం లేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
funny conversation between ys jagan, kadiri babu rao in assembly lobbies on Wednesday.ys jagan appreciated hindupur mla balakrishna.
Please Wait while comments are loading...