Gajuwaka : నేడు 18 టన్నుల బెల్లంతో చేసిన వినాయకుని నిమజ్జనం
వినాయక చవితి ఉత్సవాలు చాలా చోట్ల ముగిసాయి. వినాయక చవితి కొంతమంది తొమ్మిరోజులు, 11 రోజులు, 15 రోజలు, 21 రోజుల పాటు చేస్తుంటారు. ఇలా ఈ 15రోజులు పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను చివరిరోజున నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఇప్పటికీ రెండు తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయి. అయితే, ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాకలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం నేడు చేయనున్నారు.
ఈ వినాయకుడిని ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వినాయకుడు 75 అడుగుల ఎత్తులో ఉన్నాడు. ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా 18 టన్నుల బెల్లం కుందులను వినిగించినట్టు నిర్వహకులు తెలిపారు. ఎంతో ప్రత్యేకమైన ఈ బెల్లం వినాయకుడిని ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు. ఈ వినాయకుడు సుమారు 21 రోజుల పాటు పూజలు అందుకున్నాడు.

అత్యంత భారీ ఆకారం కలిగిన ఈ వినాయకుడిని గ్రేటర్ విశాఖ పరిధిలోని గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడిని లంబోదర ట్రస్టు ఆధ్వర్యంలో బెల్లం ముద్దులతో నిర్మించారు. బెల్లం దిమ్మెలను ఒక క్రమపద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారంతో ఈ వినాయకున్నీ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం తయారీలో అనకాపల్లికి చెందిన శిల్పులు భాగస్వాములయ్యారు. ఈ వినాయకున్ని తయారుచేసేందుకు శిల్పులు రెండు మాసాలకు పైగా కష్టపడ్డారు.
ఈ వినాయకుని కోసం అవసరమైన బెల్లం కూడా ఇక్కడిది కాదు. ఇక్కడి బెల్లం అయితే వాతావరణ పరిస్ధితులకు తట్టుకుని నిలబడదని గుర్తించిన నిర్వాహకులు రాజస్ధాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్ధాన్ లో వుండే వేడి వాతావరణకు తట్టుకోగలుగుతుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ వుంటుంది. అందుకే, ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ వినాయకున్ణి సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వినాయకుని మండపాన్ని కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. 21 రోజుల పాటు భక్తులు ఇక్కడ పూజలు చేశారు. నేడు ఈ వినాయకుని నిమజ్జనం సందర్భంగా భక్తులకు బెల్లం పంచిపెడతామని కమిటీ నిర్వాహకులు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెల్లం పంచడంపై పోలీసుల ఆంక్షలు విధించారు, బెల్లం భక్తులు తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని భక్తులకు బెల్లం పంచొద్దని, బెల్లం కరిగించమని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications