దావూద్ గ్యాంగ్‌కు టిటిడి శ్రీవారి దర్శనం: గాలి సంచలనం

దావూద్ అనుచరులకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహంలో ఆరు సూట్లను నాలుగు రోజుల పాటు అధికారులు కేటాయించారన్నారు. దావూద్ ముఖ్య అనుచరుడు, మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘరానా నేరస్తుడైన అజయ్‌కు బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగులు వెళ్లే దారిలో దర్శనం కల్పించారన్నారు.
ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఇవ్వని ప్రొటోకాల్‌ను దావూద్ గ్యాంగ్‌కు ఎందుకివ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలకు, న్యాయమూర్తులకు మాత్రమే విఐపి దర్శనం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలకు కూడా సాదారణ దర్శనమే అన్నారు.
ముక్కోటి ఏకాదశి రోజున నడకదారి భక్తుల కోసం సిద్ధం చేసిన ఉచిత లడ్డూల్లో ముప్పై ఐదు వేల లడ్డూలను అమ్ముకున్నారని, శ్రీవారి సేవా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారన్నారు. ముక్కోటి రోజున శ్రీవారి దర్శనాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏకాదశి రోజున ఆందోళన చేసిన భక్తులపై కేసులు పెట్టిన టిటిడి టిక్కెట్లు అమ్ముకున్నవారిపై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు.
బాపిరాజు వివరణ
దావూద్ ఇబ్రహీం అనుచరులు ఎవరో తనకు తెలియదని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు వివరణ ఇచ్చారు. భక్తుల పైన కేసు ఉపసంహరించుకుంటారని భావిస్తున్నామన్నార. మహారాష్ట్ర మంత్రి సిఫార్సుతో అజయ్ అనే వ్యక్తి పదిమందితో వచ్చారన్నారు. ఆరోపణలు గురించి తనకు తెలియదన్నారు. మరోవైపు భక్తులపై కేసు పెట్టే ఉద్దేశ్యం లేదని ఈవో తెలిపారు.
తలసాని పిటిషన్ పైన స్పందించిన హెచ్చార్సీ
తిరుమల ఘటనపై టిడిపి నేత తలసాని శ్రీనివాస యాదవ్ హెచ్చార్సీని ఆశ్రయించగా గురువారం స్పందించింది. ఈ నెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. టిటిడితో సంబంధం లేని అధికారితో విచారణ జరిపించాలని సూచించింది. మరోవైపు బిజెపి కూడా హెచ్చార్సీని ఆశ్రయించింది.
కమలానంద భారతి ఆఘ్రహం
శ్రీవారి భక్తుల మీద కేసు పెట్టడాన్ని కమలానంద భారతి తీవ్రంగా తప్పు పట్టారు. శ్రీవారి భక్తులు తమ సమీప పోలీసు స్టేషన్‌లలో టిటిడి ఈవో, చైర్మన్ల పైన ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications