'నోట్ల రద్దుపై జగన్ ఎందుకు నోరు విప్పట్లేదు, ఆ జిమ్మిక్కులు విజయ సాయికే తెలుసు'
రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదని, ఎందుకో చెప్పాలని టిడిపి ప్రశ్నించింది.
అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదని, ఎందుకో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దు పైన దేశంలో అన్ని పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాయని చెప్పారు. కానీ వైసీపీ మాత్రం నోరు విప్పలేదన్నారు. అవినీతి రూపు మాపే విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం లేదన్నారు.
ప్రజల నోట్ల రద్దు కష్టాలను కేంద్రం పరిష్కరించక పోవడం బాధాకరమని కేంద్రం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికి అప్పుడు కేంద్రంతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

బుగ్గన చెప్పింది అబద్దం: గాలి
హెరిటేజ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పింది అవాస్తవమని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆయన అనవసర ఆరోపణలు చేశారన్నారు. హెరిటేజ్ డైరీలో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు మాత్రమే కొన్నదని, హెరిటేజ్ చట్టబద్ధంగా వ్యాపారం చేస్తోందన్నారు.
సూటు కేసు కంపెనీలు ఏర్పాటు చేసిన ఘనత వైసిపి అధినేత జగన్‌దే అన్నారు. జగన్ కంపెనీల్లో షేర్లు పెట్టిన వాళ్లు జైళ్లకు వెళ్లారని చెప్పారు. షేర్లు తారుమారు చేసే జిమ్మిక్కులు విజయ సాయి రెడ్డికే తెలుసునని ఆరోపించారు. చంద్రబాబు పైన బ్లాక్ మనీ ఆరోపణలు చేసిన వైసిపి నిరూపించాలని డిమాండ్ చేశారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదని, ఎందుకో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం ప్రశ్నించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications