విజయవాడ-హైదరాబాద్ రూ.16వేలా?: ‘గన్నవరం’పై గాలి ఆగ్రహం
అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో అధిక ఛార్జీలు వసూలు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం శాసనమండలిలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని గాలి మండిపడ్డారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ. 16వేలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలని కోరారు. వీలైనంత త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications