హైదరాబాదులో 17 ఏళ్ల మైనర్‌పై ముగ్గురి ముఠా అత్యాచారం
హైదరాబాద్: పసితనం కూడా వీడని ఓ బాలికపై ముగ్గురు సభ్యుల ముఠా అత్యాచారానికి పాల్పడింది. హైదరాబాదులోని మేడిపల్లిలో గల బోడుప్పల్‌లో ఈ దారుణమైన సంఘటన జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి (26) కారు డ్రైవర్. బాధితురాలి ఇంటికి పొరుగునే నిందితుడు ఉంటాడు.
కలవాలని ఉందని చెప్పి రవి 17 అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వచ్చిన తర్వాత అతను ఆమెను తన బంధువుల ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తూ వెళ్లారు. బాధితురాలు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది.
బాధితురాలు హబ్సిగుడాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. రవితో ఆమెకు పరిచయం ఉంది. పది రోజుల క్రితం రవి ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె బోడుప్పల్‌లోని నిర్దేశించిన ప్రాంతానికి రాగానే రవి తన బంధువుకు చెందిన ఖాళీ ఇంటికి తీసుకుని వెళ్లాడు.

తాను ఆ ఇంటికి వెళ్లిన తర్వాత తన మిత్రులు సూరి (23), లక్ష్మణ్ అలియాస్ టిల్లులను పిలిచాడు. సూరి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, టిల్లు కార్మికుడు. అక్కడ ముగ్గురు కూడా మద్యం సేవించి, భోజనాలు చేశారు. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని వరంగల్ జిల్లాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది.
ఈలోగా తమ కూతురు కోసం వెతుకుతూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం అమ్మాయి ఇంటికి తిరిగి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.












Click it and Unblock the Notifications