చింతమనేనికి వంశీ ఘాటు కౌంటర్- 175-23లో ఏది వెంటిలేటర్ ?
ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం మిగిలున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సందర్భం దొరికితే చాలు రాజకీయ నేతలు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనపై విపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలు రాజకీయంగా రచ్చకు కారణమవుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి మంటపుట్టించాయి.
వైసీపీ వెంటిలేటర్ పై ఉందని, గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ కోసం 10 మంది సిద్ధంగా ఉన్నారని ఉదయం చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన, వైఎస్ జగన్ పై చింతమనేని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చింతమనేనికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. చింతమనేనిని ఉద్దేశించి వంశీ పలు సెటైర్లు వేశారు.

గన్నవరంలో పోటీపై చింతమనేని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వల్లభనేని వంశీ.. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. కె.ఏ పాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజమన్నారు. కోడిపందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికి తెలుసంటూ చింతమనేని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఇసుక మాఫీలో అధికారులపై దౌర్జన్యం చేసిన సంగతి అందరికీ తెలుసంటూ చింతమనేనికి వంశీ గతాన్ని గుర్తుచేశారు.
చింతమనేనికి వంశీ ఘాటు కౌంటర్- 175-23లో ఏది వెంటిలేటర్ ?#ChintamaneniPrabhakar #VallabhaneniVamsi #APPolitics #AndhraPradesh #TeluguNews #Oneindiatelugu pic.twitter.com/kYmKpkc3CR
— oneindiatelugu (@oneindiatelugu) April 21, 2023
అలాగే చింతమనేని చేసిన వెంటిలేటర్ వ్యాఖ్యలపైనా వంశీ స్పందించారు. 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా ? 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా ? అని ప్రశ్నించారు. టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టే చంద్రబాబు చివరి ఎన్నిక అంటున్నాడన్నారు. తద్వారా చింతమనేనిని, చంద్రబాబును కలిపి వంశీ కౌంటర్ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications