యువకుడిపై కక్ష: యువతి యాసిడ్ నాటకం!

Girl acid drama
అనంతపురం: అనంతపురం జిల్లాలో యువతిపై ఈ నెల 2వ తేదీన యాసిడ్ దాడి జరిగిన ఘటన కొత్త మలుపు తిరిగింది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో ముదిగుబ్బకు చెందిన డిగ్రీ విద్యార్థిని వాణిపై యాసిడ్ దాడి జరిగింది. బాధితురాలు తనంతకు తానుగా యాసిడ్ పోసుకుని అదే గ్రామానికి చెందిన రాఘవ, రామకృష్ణ అనే యువకులపై ఫిర్యాదు చేసినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ శ్యాంసుందర్ గురువారం విలేకరులకు తెలిపారు.

వాణి ఈ నెల 2న ఇంటికి నడిచి వెళుతుండగా యాసిడ్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడిన విషయం విదితమే. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాపును చేయించామని ఎస్పీ తెలిపారు. రాఘవపై వ్యక్తిగత కక్షతో వాణి తనకు తానుగా యాసిడ్ పోసుకుని ఫిర్యాదు చేశారన్నారు. యాసిడ్ దాడి జరిగిన రోజు ఆ ఇద్దరు యువకులు బత్తలపల్లిలోని పూలమండీలో ఉన్నట్లు పలురకాలుగా విచారించి ధృవీకరించుకున్నామన్నారు.

యాసిడ్‌ను తానే వాణికి ఇచ్చినట్లు మహేష్ అనే యువకుడు అంగీకరించాడన్నారు. తప్పుడు ఫిర్యాదు ఇచ్చినందుకు వాణిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చేశారు. మరోవైపు, రాజకీయ పలుకుబడితోనే కేసును తప్పుదోవపట్టించారని వాణి, తల్లిదండ్రులు ఆరోపించారు. తనపై యాసిడ్ దాడి జరిగితే న్యాయం చేయకపోగా తనపైనే నిందలు వేయడం అన్యాయమని వాణి కన్నీరు పెట్టుకున్నారు.

కాగా, సిపిఎం అనుబంధ మహిళా సంఘం ఐద్వా బాధితురాలికి బాసటగా నిలిచింది. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్‌ను కలిసి, ఎస్పీ శ్యాంసుందర్ విచారణపై తమకు నమ్మకంలేదన్నారు. ప్రత్యేక అధికారితో విచారణ చేయించి బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+