ఘోరం: బస్సు రంధ్రం నుంచి పడి బాలిక మృతి

Girl dies slipping bus hole in Mahaboobnagar district
మహబూబ్‌నగర్: ప్రైవేట్ బస్సు యజమాని నిర్లక్ష్యం వల్ల ఓ బాలిక నిండు ప్రాణం పోయింది. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూర్ సమీపంలో జరిగింది. మక్తల్ పట్టణానికి చెందిన గోవిందమ్మ, మారుతి దంపతులు సోమవారం ఇంట్లో గొడవపడ్డారు.

దీంతో గోవిందమ్మ నారాయణపేటలో ఉన్న చెల్లెలు అనంతమ్మ దగ్గరకు తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లింది. చెల్లెలు అనంతమ్మ అక్కకు నచ్చజెప్పి మక్తల్‌కు వెళ్లేందుకు గోవిందమ్మతో పాటు పిల్లలు నారాయణపేట ఎపి22డబ్ల్యు7471 నంబర్ గల బస్సులో బయలుదేరి వస్తుండగా డీజిల్ ట్యాంక్ మరమ్మతు గురైంది.

అయితే, కొద్దిరోజుల కిందట ట్యాంక్ మరమ్మతు చేసి సీటు కింద ఆ రంధ్రాన్ని మూయకుండా గోనె సంచిని వేశారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న గోవిందమ్మ రెండవ కూతురు స్వాతి (6) గోనె సంచిపై కాలు పెట్టడంతో ఆ రంధ్రంలో నుండి కిందకు జారిపడిపోవడంతో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+